రైతులతో ఎనిమిదో విడత చర్చలు ప్రారంభం

కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం దిగి రావడంలేదు.. రైతులు వెనక్కి తగ్గడంలేదు.. దీంతో ఈ అంశంలో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం, రైతుల .......

Published : 08 Jan 2021 15:10 IST

దిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం దిగి రావడంలేదు.. రైతులు వెనక్కి తగ్గడంలేదు.. దీంతో ఈ అంశంలో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు జరిగినా ఈ సమస్య కొలిక్కి రాకపోవడంతో దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనలు 44వ రోజూ కొనసాగుతున్నాయి. కటిక చలిని, అకాల వర్షాలను సైతం లెక్కచేయకుండా కర్షకులు తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌, సోం ప్రకాశ్‌ రైతులతో మరోసారి చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల్లో 41 రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు  చట్టబద్ధత కల్పించే అంశాలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది.

అయితే, సాగు చట్టాల రద్దు మినహా ఏ ప్రతిపాదనైనా పరిశీలిస్తామని చెబుతోన్న కేంద్రం.. ఈ చట్టాలను రైతులు అర్థంచేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే, రైతుల మాత్రం సవరణలకు అంగీకరించేదిలేదని, వెనక్కి తీసుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి. తమ డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభమైన ఎనిమిదో విడత చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి..

ఆ ఒక్కటీ అడగొద్దు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని