సంజీవ్‌ లాల్‌ అరెస్ట్‌

ఝార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్‌ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్‌) సంజీవ్‌ కుమార్‌ లాల్‌ (52), లాల్‌ పనిమనిషి జహంగీల్‌ ఆలం(42)లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది.

Published : 08 May 2024 05:56 IST

పనిమనిషి జహంగీర్‌ ఆలం కూడా
మరో రూ.1.5 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ

రాంచీ: ఝార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్‌ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్‌) సంజీవ్‌ కుమార్‌ లాల్‌ (52), లాల్‌ పనిమనిషి జహంగీల్‌ ఆలం(42)లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. అనంతరం వీరిని నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రత్యేక న్యాయమూర్తి ప్రభాత్‌కుమార్‌ శర్మ ఎదుట హాజరు పరిచింది. అనంతరం న్యాయమూర్తి ఇద్దరు నిందితులను అరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించారు. సోమవారం సోదాల సందర్భంగా జహంగీర్‌ నివాసంలో రూ.32 కోట్లు, మరో రెండు చోట్ల రూ.3 కోట్లు లభించిన సంగతి తెలిసిందే. మంగళవారం కూడా ఈడీ అధికారులు రాంచీలోని అయిదు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రాజీవ్‌కుమార్‌ అనే కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు