Fauci: అమెరికా టీకాలతో ఆ వేరియంట్లకు చెక్
అమెరికాలో ఇప్పటికే వినియోగంలో ఉన్న కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిపై సమర్థంగా పనిచేస్తున్నాయని ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుడు ఆంటోనీ ఫౌచీ తెలిపారు. ఈ వ్యాక్సిన్లు బీ.1.617, బీ.1.168 రకాల నుంచ.......
అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ
వాషింగ్టన్: అమెరికాలో ఇప్పటికే వినియోగంలో ఉన్న కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిపై సమర్థంగా పనిచేస్తున్నాయని ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుడు ఆంటోనీ ఫౌచీ తెలిపారు. ఈ వ్యాక్సిన్లు బీ.1.617, బీ.1.168 రకాల నుంచి పాక్షికంగా లేదా పూర్తిగా రక్షణ కల్పిస్తాయని స్పష్టం చేశారు. ఈ టీకాలు తీసుకున్న వారికి వైరస్‌ను తటస్థీకరించడానికి సరిపడా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని తెలిపారు. దీనిపై జరిగిన పరిశోధనా ఫలితాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.
వ్యాక్సినేషన్‌ను బలపరుస్తూ గత కొన్ని రోజులుగా వెలువడుతున్న అనేక అధ్యయనాల్లో ఇదీ ఒకటని ఫౌచీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంంలో ప్రతిఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచించారు. అమెరికాలో ఇప్పటి వరకు ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భారీ ఎత్తున కొనుగోలు చేసినప్పటికీ.. వాటిని నిల్వకే పరిమితం చేశారు.
భారత్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వేరియంట్లపై ఫైజర్, మోడెర్నా టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు అమెరికాకు చెందిన ఎన్‌వైయూ గ్రాస్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, లాంగోన్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు. అమెరికాలో ఈ రెండు వ్యాక్సిన్లను తీసుకున్న వ్యక్తుల నుంచి నమూనాలను సేకరించి వాటిని ల్యాబ్‌లో భారత్‌లో వెలుగుచూసిన బి.1.617, బి.1.618 వేరియంట్లతో కలిపి పరీక్షించినట్లు పేర్కొన్నారు. ఫైజర్, మోడెర్నా టీకాలు రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని వెల్లడించారు. తాజాగా ఫౌచీ చేసిన ప్రకటనతో ఈ అధ్యయనాన్ని ఆయన ధ్రువీకరించినట్లైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్‌ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్‌లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్‌కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక