రజనీ ‘రోబో’ను ఇలా షూట్‌ చేశారు!

రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘రోబో’. శంకర్‌ టేకింగ్‌, రోబోగా రజనీ నటన, ఐశ్వర్యరాయ్‌ అందం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక చిట్టిగా రోబో పాత్రలో

Published : 04 Oct 2020 10:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘రోబో’. శంకర్‌ టేకింగ్‌, రోబోగా రజనీ నటన, ఐశ్వర్యరాయ్‌ అందం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక చిట్టిగా రోబో పాత్రలో రజనీ నటన అందరినీ అలరించింది. ఇక క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ ఒళ్లుగగురుపొడిచేలా చేశాయి. 2010లో విడుదలైన ఈ సినిమా ఇటీవలే పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఓ ఆసక్తికర వీడియోను పంచుకుంది. రోబోను తయారు చేయడం, ట్రైన్‌లో ఫైట్‌ సీన్‌, మంటల్లో చిక్కుకున్న అమ్మాయిని కాపాడే సన్నివేశం మొదలైన వాటిని ఎలా చిత్రీకరించారో అందులో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆ ఆసక్తికర వీడియోను మీరూ చూసేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని