పెదనాన్న.. ముద్దుల కూతురు.. ఓ సెల్ఫీ

మెగావారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక వివాహ వేడుకకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే శనివారం ఆమె పెళ్లికుమార్తెగా ముస్తాబయింది...

Updated : 07 Dec 2020 14:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మెగావారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక వివాహ వేడుకకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే శనివారం ఆమె పెళ్లి కుమార్తెగా ముస్తాబయింది కూడా. ఈ సందర్భంగా 32 ఏళ్ల క్రితం తన తల్లి నిశ్చితార్థంలో కట్టుకున్న చీరను కట్టుకొని కుందనపుబొమ్మలా మెరిసిపోయింది. ఇలా పెళ్లి పనుల్లో తీరికలేకుండా ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా తన వారందరితో ఫొటోలు దిగి అభిమానులతో పంచుకుంటోంది. అందులో భాగంగా పెదనాన్న చిరంజీవితో.. అక్కల(చిరంజీవి కూతుళ్లు)తో దిగిన ఫొటోలను పంచుకుంది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవితో దిగిన ఫొటో మాత్రం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పెదనాన్నతో కలిసి నిహారిక సెల్ఫీ తీసుకుంటున్న ఫొటోను నాగబాబు తన ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో పంచుకున్నారు. ‘ఆయన ప్రేమ.. సమయం, వయసు అనే సరిహద్దులను దాటింది. ఆయన చిరునవ్వు ప్రతిక్షణాన్ని వేడుకలా మారుస్తుంది’ అంటూ ఆ ఫొటోను పోస్టు చేశారు. ఈ నెల 9న చైతన్య జొన్నగడ్డ, నిహారిక కొణిదెల వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గల ఉదయ్‌విలాస్‌ ఈ శుభకార్యానికి వేదిక కాబోతోంది. ఆగస్టులోనే నిహారిక-చైతన్య నిశ్చితార్థం జరిగింది.

ఇవీ చదవండి..

నిహారిక పెళ్లి కూతురాయనే..

నిహారిక పెళ్లి పత్రిక ఇదేనా?.. ఫొటోలు వైరల్‌

పెళ్లికుమార్తెగా ముస్తాబైన నిహారిక

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని