నిహారిక-చైతన్య డెస్టినేషన్‌ వెడ్డింగ్‌..!

మెగా కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్న విషయం తెలిసిందే. నటుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహం ఈ ఏడాది చివర్లో జరగనుంది. ఇటీవల నిశ్చితార్థంతో ఒక్కటైన నిహారిక-చైతన్య పెళ్లి గురించి తాజాగా నాగబాబు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నిహారిక పెళ్లి విషయంలో

Updated : 17 Oct 2020 15:08 IST

పెళ్లి ఏర్పాట్లలో వరుణ్‌తేజ్‌ బిజీ

హైదరాబాద్‌: మెగా కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్న విషయం తెలిసిందే. నటుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహం ఈ ఏడాది చివర్లో జరగనుంది. ఇటీవల నిశ్చితార్థంతో ఒక్కటైన నిహారిక-చైతన్య పెళ్లి గురించి తాజాగా నాగబాబు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నిహారిక పెళ్లి విషయంలో మేమెంతో సంతోషంగా ఉన్నాం. కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది ఎంతో క్లిష్టంగా మారింది. ఇలాంటి కఠిన సమయం నుంచి కొంతవరకూ బయటకు వచ్చేలా కుటుంబంలో శుభకార్యం జరగడం ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను నా కుమారుడు వరుణ్‌తేజ్‌ చూసుకుంటున్నాడు. డిసెంబర్‌ నెలలో నిహారిక-చైతన్య డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరగనుంది. పెళ్లి తేదీని త్వరలోనే అందరికీ తెలియజేస్తాం. వెడ్డింగ్‌కు సంబంధించి వరుణ్‌ ఇప్పటికే కొన్ని ప్రాంతాల పేర్లతో లిస్ట్‌ సిద్ధం చేశాడు’ అని నాగబాబు పేర్కొన్నారు.

గుంటూరు ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యను తాను పరిణయమాడనున్నట్లు లాక్‌డౌన్‌ సమయంలో నిహారిక సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. చైతన్యతో దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఆగస్టు నెలలో వేడుకగా జరిగింది. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం నిహారిక తన స్నేహితులతో కలిసి గోవాలో బ్యాచిలరేట్‌ పార్టీ జరుపుకొన్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని