Ira Khan: ప్రియుడితో పెళ్లి.. స్పందించిన అమిర్‌ కుమార్తె

తన పెళ్లి వార్తలపై అమిర్‌ఖాన్‌ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan) తాజాగా స్పందించారు. వచ్చే నెలలో తాను పెళ్లి చేసుకోవడం లేదని చెప్పారు.

Published : 14 Sep 2023 16:45 IST

ముంబయి: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమిర్‌ఖాన్‌ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan) వివాహం గురించి గత కొన్ని రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే నెల మూడో తేదీన నుపుర్‌తో ఆమె వివాహం జరగనుందంటూ బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఐరా ఖాన్‌ తాజాగా స్పందించారు. అవన్నీ అవాస్తవాలు మాత్రమేనని అన్నారు. పెళ్లి కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. డేట్‌ ఫిక్స్‌ అయ్యాక తప్పకుండా వెల్లడిస్తానని అన్నారు.

ధనుష్‌ టు విశాల్.. స్టార్‌ హీరోలకు నిర్మాతల మండలి షాక్‌

అమిర్‌ ఖాన్‌  - రీనాదత్త దంపతుల కుమార్తెగా ఐరా ఖాన్‌ సినీ ప్రియులకు సుపరిచితం. మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ తరచూ ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటారు. గత కొన్నేళ్ల నుంచి అమిర్‌ ఖాన్‌కు వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా నుపుర్‌ పనిచేస్తున్నాడు. దీంతో ఐరా సైతం నుపుర్‌ వద్ద ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఏర్పడింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి నిశ్చితార్థం గతేడాది చివర్లో జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు