Bigg Boss Telugu 7: ‘బిగ్‌బాస్‌7’ టాప్‌-3లో ఉండేది వీళ్లే.. అసలు విషయం చెప్పేసిన సందీప్‌ మాస్టర్‌

Aata Sandeep: ఆటపరంగా బిగ్‌బాస్‌ హౌస్‌(Bigg Boss Telugu 7)లో భోలే షావలి, రతిక రోజ్‌లు తనకన్నా తక్కువగానే ఆడతారని సందీప్‌ మాస్టర్‌ అన్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన ఆయన అక్కడ తన 60 రోజుల ప్రయాణ అనుభూతులను పంచుకున్నారు.

Published : 30 Oct 2023 16:46 IST

‘‘60 రోజులు బిగ్‌బాస్‌ హౌస్‌ (Bigg boss Telugu 7)లో ఉండటం తక్కువేం కాదు. కానీ, ప్రేక్షకుల నిర్ణయాన్ని ఒప్పుకోక తప్పదు. ఎక్కడో మిస్టేక్‌ జరిగింది. బహుశా నేను ఇన్ని రోజులు నామినేషన్స్‌లో లేకపోవడం కూడా కావచ్చు. ఫస్ట్‌ పవర్‌ అస్త్ర గెలిచి, ఐదు వారాల పాటు ఇమ్యూనిటీతో ఉన్నా. రెండోసారి నామినేట్‌ అయితే, గౌతమ్ వచ్చి నన్ను సేవ్‌ చేశాడు. మూడోసారి నేను నామినేట్‌ కాలేదు. ఇప్పుడు కూడా తేజ వేసింది పాజిటివ్‌ నామినేషన్‌. కేవలం ఒక్క ఓటుతోనే నేను ఈ నామినేషన్స్‌లో ఉన్నా. గౌతమ్‌ సీక్రెట్‌ రూమ్‌ నుంచి వచ్చిన తర్వాత నన్ను సేవ్‌ చేయమని అతడికి హింట్‌ ఇవ్వలేదు. హౌస్‌మేట్స్‌ అందరూ అతడు అనర్హుడని ఎలిమినేట్‌ చేస్తే, నేను మాత్రం అర్హుడని ఓటు వేశా. అందుకు కృతజ్ఞతగా నన్ను సేవ్‌ చేశాడు. మనం ఒకరికి మంచి చేస్తే, అంతా మంచే జరుగుతుంది. నా విషయంలో అది వర్కవుట్‌ అయింది’’

‘‘ఇమ్యూనిటీ కారణంగా ఐదు వారాల పాటు, నామినేషన్స్‌లో లేకుండా ఉండటం సర్‌ప్రైజ్‌. హౌస్‌లో నేను ఎక్కడా గ్రూప్‌ మెయింటేన్‌ చేయలేదు. వృత్తిపరంగా నేను ఎవరితోనైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా. మా ఇంట్లో ఎలా ఉంటానో హౌస్‌లోనూ అలాగే ఉన్నా. నాతో ఎవరైనా అరుస్తూ మాట్లాడితే, నేను అదే స్థాయిలో మాట్లాడాతా. నేను సేఫ్ ప్లేయర్‌ను కాదు. సంచాలక్‌గానూ బాగానే చేశా. మనం ఒక గేమ్‌ ఆడేటప్పుడు మనల్ని మనం రక్షించుకుంటాం. కొన్ని గేమ్స్‌ విషయంలో అలా వ్యవహరించా. బిగ్‌బాస్‌ చెప్పిన రూల్స్‌ను మాత్రమే నేను అమలులో పెట్టా. టాస్క్‌ల సమయంలో ఒకట్రెండ్‌ సార్లు పొరపాటు జరిగిన మాట వాస్తవం. స్మైలీ టాస్క్‌లో ముందుగా గంటకొట్టడం తప్పే. బిగ్‌బాస్‌ హౌస్‌లో నేను మాట్లాడింది అసభ్యపదజాలం ఏమీ కాదు. మనం రెగ్యులర్‌గా ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు వచ్చే పదాలే. తేజతో మాట్లాడిన మాట మాత్రం తప్పు. దానికి క్షమాపణలు చెబుతున్నా. అలాగే, యావర్‌ విషయంలో శోభా మాట్లాడింది కూడా కరెక్ట్‌ కాదు. ఆ తర్వాత ఆ విషయాన్ని ఆమెకు చెప్పా. నేనెవరికీ భయపడను.  చాలా సందర్భాల్లో గౌతమ్‌, అమర్‌లు కూడా తప్పు మాట్లాడారు’’ 

‘‘ఇప్పటికీ హౌస్‌లో నా కన్నా తక్కువగా ఆడుతున్న వాళ్లు ఉన్నారు. రతిక రోజ్‌, భోలే షావలి ఆడిందేమీ లేదు. ఒకరకంగా చెప్పాలంటే నా కన్నా ముందే భోలే వెళ్లవచ్చని అనుకున్నా. హౌస్‌లో ఉన్నప్పుడు నా ఆటను నేను ఒంటరిగానే ఆడా. ఒక గ్రూప్‌ అంటూ మమ్మల్ని వేరు చేయటం సరికాదు. పల్లవి ప్రశాంత్‌, ప్రియాంక, అమర్‌దీప్‌లు టాప్‌-3లో ఉంటారు’’ అని సందీప్‌ మాస్టర్‌ చెప్పుకొచ్చారు.

  • హౌస్‌లో వాళ్ల గురించి సందీప్‌ ఏమన్నారంటే?
  • భోలే షావలి: తాను హీరో అనుకుంటాడు. కానీ, కాదు. టాస్క్‌ పరంగా జీరో.
  • రతిక: తనకే అన్నీ తెలుసని అనుకుంటుంది. చాలా తెలివైనదానినని, ఎవరినైనా కంట్రోల్ చేయగలనని భావిస్తుంది. అది ఆమె అపోహ.
  • అర్జున్‌: తాను చాలా బలవంతుడినని, తనలాంటి తోపు ఎవరూ లేరని అనుకుంటాడు. అన్నింటికీ కండబలం సరిపోదు. బుద్ధి బలం ఉండాలి. అర్జున్‌కు హౌస్‌లో అంత సీన్‌ లేదు.
  • శివాజీ: ప్రశాంత్‌, యావర్‌లను తానే కెప్టెన్‌ చేశాననే అపోహలో ఉన్నాడు. నిజం చెప్పాలంటే వాళ్లు కష్టపడి ఆడి కెప్టెన్లు అయ్యారు.
  • టేస్టీ తేజ: మంచి వాడే. కానీ, బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగేవన్నీ తనకే తెలుసని అనుకుంటాడు. బిగ్‌బాస్‌ టీమ్‌ ఏం చేస్తుందో కూడా ముందే చెబుతాడు. ఇలాగే కొనసాగితే, ఎక్కడో ఒకచోట బోల్తాపడతాడు.
  • గౌతమ్‌: తాను మారిపోయాననే అపోహలో ఉన్నాడు. అందరూ గమనిస్తున్నారు.
  • యావర్‌: ఏది జరిగినా తన వల్లే గెలిచారని, తానే తీసుకొచ్చానని అనుకుంటాడు. ఓవర్‌ కాన్ఫిడెంట్‌.
  • అశ్విని: తనతో ఎవరూ మాట్లాడటం లేదని ఇప్పటికీ అనుకుంటుంది.
  • ప్రియాంక: పాజిటివ్‌గా ఆలోచిస్తుంది. ఏదైనా గుండెల్లో దాచుకుంటుంది. తనకు తానే సర్దిచెప్పుకొని, ఆటను బాగా ఆడుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని