Suresh Gopi: జర్నలిస్ట్‌తో హీరో సురేశ్‌ గోపీ అసభ్య ప్రవర్తన.. సారీ చెబుతూ పోస్ట్‌

తన ప్రవర్తనతో చిక్కుల్లో పడ్డారు నటుడు సురేశ్‌ గోపీ (Suresh Gopi). ఓ మహిళతో ఆయన తీరు అంతటా చర్చకు దారి తీసింది.

Updated : 28 Oct 2023 18:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు, మాజీ ఎంపీ సురేశ్‌ గోపీ (Suresh Gopi) చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళా జర్నలిస్ట్‌తో ఆయన ప్రవర్తించిన తీరు అంతటా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన సదరు విలేకరికి క్షమాపణలు చెబుతూ సోషల్‌మీడియాలో శనివారం పోస్ట్‌ పెట్టారు. ‘‘ఆమెను నేనొక కుమార్తెగా భావించా. ఆ ఆప్యాయతతోనే భుజంపై చెయ్యి వేశా. ఈ ఘటన పట్ల ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తున్నా. నా ప్రవర్తన వల్ల ఆమె ఇబ్బందిపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నా’’ అని ఆయన రాసుకొచ్చారు.  అసలేం జరిగిందంటే..?

నార్త్‌-కొయ్‌కోడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సురేశ్‌ గోపీ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆయన పలువురు జర్నలిస్ట్‌లతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఓ మహిళా విలేకరికి సమాధానం చెబుతూ.. ఆమె భుజంపై చెయ్యి వేశారు. ఆయన ప్రవర్తనతో ఇబ్బందిపడిన సదరు విలేకరి కాస్త దూరం జరిగింది. అనంతరం, మరో ప్రశ్న అడిగేందుకు ఆమె ముందుకు రాగా.. ఆయన మరోసారి ఆమెను తాకారు. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరును తప్పుబట్టారు. దీంతో ఆయన క్షమాపణలు చెబుతూ పోస్ట్‌ పెట్టారు.

Chiranjeevi: నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అది: చిరంజీవి స్పెషల్‌ పోస్ట్‌

‘యువజనోత్సవం’, ‘సాయం సంధ్యా’, ‘పి.సి.369’, ‘న్యూ దిల్లీ’, ‘ది న్యూస్‌’, ‘పరంపర’, ‘డాడీ’, ‘ధ్రువమ్‌’ వంటి చిత్రాలతో మలయాళంలో నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు సురేశ్‌ గోపీ. ‘అంతిమ తీర్పు’, ‘ఆ ఒక్కడు’ వంటి తెలుగు సినిమాల్లోనూ ఆయన నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని