అజిత్‌ ఇంటికి బాంబు బెదిరింపు: నిందితుడి గుర్తింపు

ప్రముఖ నటుడు అజిత్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. తమిళనాడు పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆయనను బెదిరించిన ఫోన్‌కాల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో ఛేదించారు. చెన్నైలోని మరక్కన్నమ్‌లో ఉండే దినేశ్‌ ఈ బెదిరింపు కాల్‌ చేసినట్లు గుర్తించారు.

Updated : 02 Jun 2021 18:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు అజిత్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. తమిళనాడు పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆయనను బెదిరించిన ఫోన్‌కాల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో ఛేదించారు. చెన్నైలోని మరక్కన్నమ్‌లో ఉండే దినేశ్‌ ఈ బెదిరింపు కాల్‌ చేసినట్లు గుర్తించారు. ఆ వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని నిర్ధారించారు. తమిళనాడు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఒక నంబర్‌ నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. సినీ నటుడు అజిత్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు చెప్పడంతో వెంటనే పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. తనికీ చేయగా ఎలాంటి బాంబు లభ్యం కాలేదు. ఆ ఫోన్‌కాల్‌ కేవలం ఆకతాయి చర్య అని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు కాల్‌ చేసిన వ్యక్తి గతంలోనూ పలుమార్లు ఇలాంటి చర్యలకు పాల్పడ్డట్లు గుర్తించారు. గతంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో పాటు తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ఇంట్లోనూ బాంబులు పెట్టినట్లు బెదిరింపు కాల్స్‌ చేశాడు.

మరోవైపు అజిత్‌కు బాంబు బెదిరింపు కాల్‌ రావడం ఇది రెండోసారి. తమిళనాడులోని ఇంజంబక్కమ్‌లో అజిత్‌ ఇల్లు ఉంటుంది. గతేడాది భువనేశ్‌ అనే వ్యక్తి కూడా ఇలాంటి చర్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అజిత్‌.. ‘వాలిమై’ చిత్రంలో బిజీగా ఉన్నారు. హెచ్‌.వినోద్‌ ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయింది. స్పెయిన్‌లో ఒక ఫైట్‌ సీన్‌ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. 2018లో ‘వాలిమై’ చిత్రాన్ని ప్రకటించారు. అయితే వేర్వేరు కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యం అవుతోంది. ఈ చిత్రంలో అజిత్‌ మరోసారి పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు