బేర్‌గ్రిల్స్‌తో అక్షయ్.. సాహసయాత్ర
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్ ప్రముఖ సాహస యాత్రికుడు..
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్‌కుమార్ ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేయనున్నాడు. అతడితో కలిసి చిత్రీకరించిన సాహసయాత్ర ఎపిసోడ్ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘నన్నో పిచ్చోడు అనుకుంటున్నారా.. అయితే పిచ్చోళ్లే ఇలా అడవిలో సాహసాలు చేస్తారు’ అంటూ ఆ టీజర్‌కు తన వ్యాఖ్యానాన్ని జత చేశాడు. కాగా ఆ టీజర్ సినీ, సాహసయాత్ర ప్రేమికుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. బేర్ సైతం ఓ మోషన్ పోస్టర్‌ను పంచుకున్నాడు. ‘జీవితమే ఓ సాహసయాత్ర. ఇలా సాహసాలను ఎంజాయ్ చేసే వాళ్లు మరికొందరు ఉన్నారు. లెజెండరీ అక్షయ్ కుమార్ ఓ ఉత్తమ సాహస యాత్రికుడు’ అంటూ పేర్కొన్నాడు.
ఈ సాహసయాత్ర ఎపిసోడ్ సెప్టెంబర్ 11న డిస్కవరీ ప్లస్ యాప్‌లో విడుదల కానుంది. సెప్టెంబర్ 14న డిస్కవరీ ఛానల్లో ప్రసారం కానుంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, నటుడు రజినీ కాంత్.. బేర్ గ్రిల్స్‌తో కలిసి సాహసయాత్ర చేశారు. వారి తర్వాత ఈ యాత్ర చేసిన మూడో భారతీయుడిగా అక్షయ్ నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అగ్గంటుకుంది సంద్రం’.. ‘దేవర’ సాంగ్ వచ్చేసింది
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఇందులోని తొలి గీతం తాజాగా విడుదలైంది.
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
ఆమిర్ నటించిన ‘గజనీ’మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు నటుడు ప్రదీప్ రావత్ -
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్‌గేల్‌తో రిషబ్ ఫొటో
ధోనీపై కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. క్రిస్‌గేల్‌తో కలిసి దిగిన ఫొటోను రిషబ్ షేర్ చేశారు. -
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్‌కు ముందు అనుకున్న హీరోలెవరంటే?
సుమంత్ హీరోగా నటించిన ‘గోదావరి’కి 18 ఏళ్లు. ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
కథ కలిపింది..ఇద్దరినీ!
హిట్టు మాట వినిపించి... స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారంటే చాలు.. ఇక ఆ తర్వాత సదరు నాయికల ప్రయాణమంతా అందుకు తగ్గట్లుగా సాగాల్సిందే. -
కల్కి.. పాట వచ్చేస్తోంది
‘కల్కి 2898ఎ.డి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ప్రభాస్. -
‘నా ఉచ్ఛ్వాసం కవనం’..
తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకువచ్చి, సరికొత్త పోకడ సృష్టించిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. -
సిద్ధార్థ్.. కృతి.. ఓ ప్రేమకథ?
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించి సినీప్రియుల మనసు దోచుకుంది బాలీవుడ్ నాయిక కృతి సనన్. -
సరికొత్త రొమాంటిక్ లవ్‌స్టోరీ
వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘సిల్క్ శారీ’. -
ఛోటా భీమ్ సూపర్ పవర్
‘ధైర్య సాహసాలతో తన ప్రాణాలు పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఒకడుంటాడు. -
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్‌కు ప్రమాదం..!
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ అదే జోరు.. పంజాబ్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు