Alia bhatt:ఆ క్షణం కన్నీళ్లాగలేదు

‘‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’..ఇదే నా తొలి సినిమా. కరణ్‌ జోహార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం స్కూల్‌ యూనిఫామ్‌లోనే ఆడిషన్స్‌లో పాల్గొన్నా’ అని అంటోంది బాలీవుడ్‌ అగ్రకథానాయిక అలియా భట్‌.

Updated : 13 Dec 2023 09:26 IST

‘‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’..ఇదే నా తొలి సినిమా. కరణ్‌ జోహార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం స్కూల్‌ యూనిఫామ్‌లోనే ఆడిషన్స్‌లో పాల్గొన్నా’ అని అంటోంది బాలీవుడ్‌ అగ్రకథానాయిక అలియా భట్‌. తొలి సినిమా నుంచి భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ స్టార్‌ కథానాయికగా ఎదిగింది అలియా. తన నటనకిగానూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. నటనతోనే కాదు నిర్మాతగానూ మెప్పిస్తోందీమె. ఇటీవల జడ్డాలో జరిగిన రెడ్‌ సీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2023లో పాల్గొన్న అలియా తన మొదటి సినిమా ఆడిషన్‌ ఎలా జరిగిందనే జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంది. ‘నేను 11వ తరగతి చదువుతున్న సమయంలో ఒకరోజు నాకు కరణ్‌ జోహార్‌తో మీటింగ్‌ ఉన్నట్లు ఫోన్‌కాల్‌ వచ్చింది. స్కూల్‌లో ఉన్న నేను యూనిఫామ్‌తో కరణ్‌ని కలవడానికి ఆయన ఆఫీస్‌కి వెళ్లాను. అప్పుడు నేను ఎక్కువ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తింటూ చాలా బొద్దుగా ఉండేదాన్ని.  నన్ను చూసిన వెంటనే ఆడిషన్‌ ఇవ్వుమని అన్నారు. ఆడిషన్‌ అంటే ఏమిటో తెలియకుండానే లోపలికి వెళ్లి ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. నేను ఆ సినిమాలో నాయికగా ఎంపికయ్యానని కరణ్‌ చెప్పిన ఆ క్షణం నాకు కన్నీళ్లాగలేదు. ఆనందంతో ఒక కప్‌ కేక్‌ తినొచ్చా అని కరణ్‌ అడిగా(నవ్వుతూ). ఆ విషయం తెలిసిన మా అమ్మ నేను సినిమాల్లో నటించడానికి కొంచెం సంకోచించినా మా నాన్న మాత్రం అంగీకరించారు’ అంటూ గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ‘జిగ్రా’ చిత్రీకరణలో బిజీగా ఉంది అలియా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని