shabana: వేడుకలా షబానా 50 ఏళ్ల సినీ ప్రయాణం

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి షబానా అజ్మీ చలనచిత్ర పరిశ్రమలో విజయవంతంగా 50ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈమె ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(ఎన్‌వైఐఫ్‌ఫ్‌) ఓ వేడుకను నిర్వహించనుంది.

Updated : 01 May 2024 09:50 IST

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి షబానా అజ్మీ చలనచిత్ర పరిశ్రమలో విజయవంతంగా 50ఏళ్లను పూర్తి చేసుకున్నారు. ఈమె ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా న్యూయార్క్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(ఎన్‌వైఐఫ్‌ఫ్‌) ఓ వేడుకను నిర్వహించనుంది. వచ్చే నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎన్‌వైఐఫ్‌ఫ్‌ తాజాగా వెల్లడించింది. 1974లో ‘అంకుర్‌’ చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టిన షబానా. ఇన్నేళ్లు చిత్రపరిశ్రమకు అందించిన సేవలకు విశేష ఆదరణ లభించిందని సినీ వర్గాలు తెలిపాయి. భారతీయ అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమలో షబానా ఈ ఏడాదితో ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, దీపా మెహతా దర్శకత్వంలో ఈమె నటించిన ‘ఫైర్‌’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ నేఫథ్యంలో షబానా మాట్లాడుతూ...‘‘ఎన్‌వైఐఫ్‌ఫ్‌’ ప్రారంభమైనప్పటి నుంచి దానితో నాకు మంచి అనుబంధం ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఎన్‌వైఐఫ్‌ఫ్‌ సాధించిన పురోగతి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నా 50ఏళ్ల సినీ ప్రయాణాన్ని ఎన్‌వైఐఫ్‌ఫ్‌ ఓ వేడుకలా నిర్వహిస్తున్నందుకు సంతోషిస్తున్నాను’ అని అన్నారు. ఈ కార్యక్రమం మే 31 నుంచి జూన్‌ 2 వరకూ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని