bahubali: బాహుబలి నుంచి యానిమేటెడ్‌ సిరీస్‌

ప్రభాస్‌ - రాజమౌళి కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో ‘బాహుబలి’ సిరీస్‌ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. ఇప్పుడీ ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి ఓ యానిమేటెడ్‌ సిరీస్‌ రానుంది.

Updated : 01 May 2024 09:47 IST

ప్రభాస్‌ - రాజమౌళి కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రాల్లో ‘బాహుబలి’ సిరీస్‌ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. ఇప్పుడీ ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి ఓ యానిమేటెడ్‌ సిరీస్‌ రానుంది. దీనికి ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీని ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. ‘‘మాహిష్మతి ప్రజలు అతని పేరు జపించినప్పుడు విశ్వంలోని ఏ శక్తి అతన్ని తిరిగి రాకుండా ఆపలేదు’’ అంటూ జక్కన్న తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని