Alia bhatt: అక్కడే ఉంటే ఏడ్చేసేవాళ్లం

‘ఆనందం ఎక్కువైతే ఒక్కోసారి నోట్లోంచి మాట రాదు. ఆ సంతోషం ఆనందభాష్పాల్లా వ్యక్తమవుతుంది’ అంటోంది అలియా భట్‌.

Updated : 06 Nov 2023 13:51 IST

నందం ఎక్కువైతే ఒక్కోసారి నోట్లోంచి మాట రాదు. ఆ సంతోషం ఆనందభాష్పాల్లా వ్యక్తమవుతుంది’ అంటోంది అలియా భట్‌. కృతి సనన్‌తో కలిసి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఆనాటి భావోద్వేగాల్ని తాజాగా పంచుకుంది. ‘ఆ క్షణాలు నాకు, కృతికి ఒక మరుపురాని జ్ఞాపకం. అవార్డు కార్యక్రమంలో వేదిక ఎక్కే సమయంలో కృతి నా ముందు నిల్చుంది. ‘నిన్నొకసారి కౌగిలించుకోచ్చా?’ అని అడిగింది. నేను వెంటనే తనని హగ్‌ చేసుకున్నా. ఇద్దరం కాసేపు అలాగే ఉండిపోయి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాం. ఆ క్షణం ఇద్దరి కళ్లలో నీళ్లు. ఇంకాసేపు అలాగే ఉంటే.. అక్కడే ఏడ్చేసేవాళ్లమేమో! ఇద్దరమ్మాయిల కల నెరవేరిన రోజది’ అంటూ అవార్డు అందుకోవడానికి ముందు జరిగిన సంగతుల్ని గుర్తు చేసుకుంది అలియా. ‘గంగూభాయ్‌ కాఠియావాడీ’, ‘మిమీ’ చిత్రాల్లో నటనకు ఈ ఇద్దరూ సంయుక్తంగా ఉత్తమ నటీమణులుగా ఎంపికైన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని