Amitabh Bachchan: మనవడికి అమితాబ్‌ అభినందనలు

‘ది ఆర్చీస్‌’.. బాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుల వారసులు ఈ సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెడుతున్నారు.

Updated : 11 Nov 2023 15:18 IST

‘ది ఆర్చీస్‌’.. బాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుల వారసులు ఈ సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెడుతున్నారు. షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌, దివంగత శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నందా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జోయా అక్తర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌ తన మనవడు నందాకి శుభాకాంక్షలు తెలుపుతూ... యువ కథానాయకుడిగా కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తావని కోరుకుంటున్నా అంటూ ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ పెట్టారు. అగస్త్య నందాని చూసి గర్వపడుతున్నానంటూ అభిషేక్‌ బచ్చన్‌ తెలిపారు. ‘ఇది చాలా బాగుంది. ఈ సినిమా చూసేందుకు చాలా ఆతృతగా ఉన్నాను. అగస్త్య.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. చిన్నప్పుడు నా బెడ్‌పై నుంచి దూకుతూ గీటార్‌ వాయించే స్థాయి నుంచి అదే గీటార్‌ పట్టుకుని ఇప్పుడు తెరపై కనిపిస్తున్నావు. ఈ స్థాయికి ఎదిగిన నీ ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతున్న యువకథానాయకులందరికీ ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ వ్యాఖ్యల్ని జోడించారు. ఈ సినిమా డిసెంబరు 7న ఓటీటీ వేదికగా విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని