Anand Deverakonda: రన్‌.. ఫన్‌.. గన్‌

‘బేబి’తో హిట్టు కొట్టి జోరు మీదున్నారు ఆనంద్‌ దేవరకొండ. ఇప్పుడు ‘గం.. గం.. గణేశా’ అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యారు.

Updated : 10 Sep 2023 14:08 IST

‘బేబి’తో హిట్టు కొట్టి జోరు మీదున్నారు ఆనంద్‌ దేవరకొండ. ఇప్పుడు ‘గం.. గం.. గణేశా’ అంటూ సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఉదయ్‌ శెట్టి తెరకెక్కించారు. కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నటి సమంత సామాజిక మాధ్యమాల వేదికగా శనివారం విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రంలో ఆనంద్‌ రెండు రైఫిల్స్‌ పట్టుకొని ఆసక్తికరంగా కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో గన్స్‌ పట్టుకున్న గ్యాంగ్స్‌, బాంబు పేలుళ్ల దృశ్యాలు కనిపించాయి. ‘రాజువారి పల్లి.. రన్‌-ఫన్‌-గన్‌’ అంటూ ఆ పోస్టర్‌పై కనిపించిన ఓ వ్యాఖ్య ఆసక్తిరేకెత్తించింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి చేతన్‌ భరద్వాజ్‌ సంగీతమందిస్తున్నారు. ఆదిత్య జవ్వాడి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని