Saindhav: వెంకటేశ్‌ ‘సైంధవ్‌’లో మరో హీరో.. ఎవరంటే?

వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘సైంధవ్‌’ సినిమాలో మరో హీరో నటిస్తున్నారు. ఆయనెవరంటే?

Published : 30 Aug 2023 17:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). ఈ సినిమాలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ (Nawazuddin Siddiqui) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మరో హీరో ఈ ప్రాజెక్టులో భాగమైనట్లు నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ (niharika entertainment) సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది. ఆ నటుడు ఎవరో కాదు.. ఆర్య (Arya). ఈ సినిమాలో ఆయన మానస్‌ అనే పాత్ర పోషిస్తున్నారు. పొడవాటి జుట్టుతో ఓ తుపాకీ చేతపట్టి ఆర్య నడుస్తూ కనిపించేలా తీర్చిదిద్దిన లుక్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

పొగరుతో విరాళాలు వద్దనలేదు.. కారణమిదే: రాఘవా లారెన్స్‌

ఇది వెంకటేశ్‌ 75వ చిత్రం కావడంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆయన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వెంకటేశ్‌ చాలా కొత్తగా కనిపించనున్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రంలో హీరోయిన్లు రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్‌, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో ఎక్కువగా చిత్రాలు చేసే ఆర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘వరుడు’తో ఆయన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆర్య ప్రతి నాయక పాత్ర పోషించి మెప్పించారు. ఆ తర్వాత, ‘రాజా రాణి’, ‘సార్‌పట్ట’, ‘ఎనిమీ’, ‘కెప్టెన్‌’వంటి డబ్బింగ్‌ సినిమాలతో అలరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని