Arya: తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ మలుపు... ఆర్య

‘‘తెలుగు సినిమా ఇలా కూడా  ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్‌. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా  నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్‌.

Updated : 08 May 2024 09:38 IST

‘‘తెలుగు సినిమా ఇలా కూడా  ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్‌. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా  నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్‌. ఆయన కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘ఆర్య’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 20 ఏళ్లయింది. ఈ  సందర్భంగా చిత్రబృందం  మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ వేడుకని నిర్వహించింది. అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘నా జీవితాన్ని మార్చేసిన చిత్రం ఇది. నా జీవితాన్ని ప్రభావితం చేసిన దర్శకుడు సుకుమార్‌. ‘ఆర్య’ అనే సినిమా నా కెరీర్‌ని ట్రాక్‌లోకి తీసుకొచ్చింది’’ అన్నారు. సుకుమార్‌ మాట్లాడుతూ ‘‘కొత్త దర్శకుల్ని ఎవరూ ప్రోత్సహించేవాళ్లు లేని ఆ సమయంలో, ఎంతో  ధైర్యంతో నాతో సినిమా చేశారు దిల్‌రాజు. ఆ విషయంలో ఎప్పటికీ రుణపడి ఉంటా. తన  భవిష్యత్తుని తనే వెతుక్కున్నట్టు బన్నీ పట్టుబట్టి ఈ సినిమా చేశార’’న్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌, దిల్‌రాజు, శివ బాలాజీ, దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలుతోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని