Ashish Vidyarthi: ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నా.. అందుకే రెండో వివాహం చేసుకున్నా: ఆశిష్‌ విద్యార్థి

రెండో వివాహంపై ఆశిష్‌ విద్యార్థి (Ashish Vidyarthi) వివరణ ఇచ్చారు. మొదటి భార్యతో స్నేహపూర్వకంగా విడిపోయినట్లు స్పష్టం చేశారు.

Updated : 26 May 2023 20:44 IST

హైదరాబాద్: ఆశిష్‌ విద్యార్థి.. ఒక్కసారిగా ఈ నటుడి పేరు ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 57 ఏళ్ల వయసులో రుపాలీ బరూవా (Rupali Barua)ను రెండో వివాహం చేసుకున్నట్లు ప్రకటించారు. ఆ పెళ్లికి సంబంధించిన ఫొటోలను విడుదల చేయడంతో ఆయనపై నెట్టింట వార్తలు మొదలయ్యాయి. తాజాగా తన పెళ్లి గురించి వివరణ ఇస్తూ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. మొదటి భార్యతో స్నేహపూర్వకంగానే విడిపోయినట్లు స్పష్టం చేశారు.

‘‘అందరి జీవితం ఒకేలా ఉండదు. అందరి ఆలోచనలు కూడా ఒకేలా ఉండవు. భిన్నమైన మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు. అందరి నేపథ్యాలు కూడా వేరుగా ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరూ కోరుకునేది మాత్రం సంతోషమే. నా మొదటి భార్య పీలూ విద్యార్థితో (Piloo Vidyarthi) నేను 22 ఏళ్లు కలిసున్నా. మా జీవితం ఎంతో అద్భుతంగా గడిచింది. మాకో కుమారుడు కూడా ఉన్నాడు. గత రెండు సంవత్సరాలుగా మా మధ్య మనస్పర్థలు తలెత్తాయి. కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నాం. అందుకే స్నేహపూర్వకంగా విడిపోయాం’’ అని ఆశిష్‌ విద్యార్థి (Ashish Vidyarthi) తెలిపారు.

ఇక రుపాలీ బరూవా (Rupali Barua) గురించి మాట్లాడుతూ..‘‘నేను, రూపాలీ రెండు సంవత్సరాల ముందు స్నేహితులమయ్యాం. మేము చాటింగ్‌ చేసుకున్నాం. ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకున్నాం. మేము భార్యాభర్తలుగా జీవించగలమనే నమ్మకం కలిగింది. అందుకే వివాహం చేసుకున్నాం. ఆమె వయసు 50 ఏళ్లు. నాకు 57 సంవత్సరాలు. మేము వయసు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అయినా సంతోషంగా జీవించడానికి వయసుతో సంబంధం లేదు. నాకు ఇష్టమైన వారితో కలిసి ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నా.. అందుకే తనను వివాహం చేసుకున్నా’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు