Asvins on ott: ఓటీటీలో అశ్విన్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

వసంత్‌ రవి కథానాయకుడిగా తెరకెక్కిన ‘అశ్విన్స్‌’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Updated : 17 Jul 2023 14:54 IST

హైదరాబాద్‌: వసంత్‌ రవి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘అశ్విన్స్‌’ (Asvins). విమలా రామన్‌ ముఖ్యపాత్ర పోషించారు. తరుణ్‌ తేజ దర్శకుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  హారర్‌ జోనర్‌లో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచేలా సినిమాను తీర్చిదిద్దారు. అలాగే, ఇప్పటి తరానికి అవసరమైన సందేశాన్ని మేళవించి, ‘అశ్విన్స్‌’ను తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో జులై 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ పోస్టర్‌ను పంచుకుంది.

‘గుంటూరు కారం’ బిగ్‌ అప్‌డేట్‌ లీక్ చేసిన హీరోయిన్‌

కథేంటంటే: అర్జున్‌ (వసంత్‌ రవి), రీతు, రాహుల్‌, గ్రేస్‌, వరుణ్‌.. ఐదుగురు యూట్యూబర్స్‌. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కోసం డార్క్‌ టూరిజం మీద ఓ ఎపిసోడ్‌ను చేయాలని ఇంగ్లాండ్‌లోని ఓ దీవిలో ఉన్న ఇంటికి వెళ్తారు. అక్కడ ప్రముఖ ఆర్కియాలజిస్ట్‌ ఆర్తి రాజగోపాల్‌ (విమలా రామన్‌) ఆత్మ తిరుగుతుందని, గతంలో అక్కడి వెళ్లిన 15 మందిని ఆమే చంపేసిందనే వార్త ప్రచారంలో ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న అర్జున్‌ టీమ్‌.. ఆ భవంతిలో సంచరించే ఆత్మలను, అరుపులను తమ కెమెరాలో బంధించాలని ప్రయత్నిస్తారు. మరి అలా వెళ్లిన ఐదుగురికి భవంతిలో కలిగిన వింత అనుభవాలు ఏంటి? ఆర్కియాలజిస్ట్‌ ఆర్తి రాజగోపాల్‌ ఎలా చనిపోయింది? ఓ రైతుకు అశ్వినీ దేవతలు ఇచ్చిన వరం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని