bhaje vayi vegam: విడుదల సెట్ అయ్యిందే...!
కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న ‘భజే వాయు వేగం’ విడుదల ఖరారైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి.
కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న ‘భజే వాయు వేగం’ విడుదల ఖరారైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ సమర్పణలో.. యు.వి.కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయ సరసన ఐశ్వర్య మేనన్ నటించారు. ‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రని పోషించారు. ‘‘భావోద్వేగాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. తండ్రీ తనయుల బంధం చుట్టూ మలిచిన సన్నివేశాలు చిత్రానికి ప్రధానబలం. గురువారం ఇందులోని ‘సెట్ అయ్యిందే..’ పాటని విడుదల చేస్తున్నామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మధు శ్రీనివాస్, కళ: గాంధీ నడికుడికర్, ఛాయాగ్రహణం: ఆర్.డి.రాజశేఖర్, పాటలు: రధన్, నేపథ్య సంగీతం: కపిల్‌కుమార్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్‌హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఒట్టేశారు.. ఓటేశారు!
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..