Bholaa Mania: భోళా హంగామా
‘‘అదిరే స్టైలయ్యా.. పగిలే స్వాగ్ అయ్యా... యుఫోరియా నా ఏరియా...’’ అంటూ సందడి మొదలు పెట్టారు చిరంజీవి. ఇదంతా ‘భోళా శంకర్’ సినిమా కోసమే.
‘‘అదిరే స్టైలయ్యా.. పగిలే స్వాగ్ అయ్యా... యుఫోరియా నా ఏరియా...’’ అంటూ సందడి మొదలు పెట్టారు చిరంజీవి (Chiranjeevi). ఇదంతా ‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమా కోసమే. చిరంజీవి కథానాయకుడిగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. తమన్నా కథానాయిక. కీర్తిసురేష్, సుశాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఆగస్టు 11న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీత ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ‘భోళా మేనియా... ’ పాటని ఆదివారం విడుదల చేశారు. మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాటని రామజోగయ్యశాస్త్రి రచించగా, రేవంత్ ఎల్వీ ఆలపించారు. ‘‘భావోద్వేగాలు, యాక్షన్, హాస్యం సమపాళ్లల్లో మేళవించిన చిత్రమిది. తొలి పాట విడుదలతో భోళా మేనియా మొదలైంది. ఈ పాటలో చిరంజీవి డాన్సులతోపాటు, ఆయన స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటుంద’’ని సినీవర్గాలు తెలిపాయి. రఘుబాబు, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి, సురేఖావాణి, శ్రీముఖి, హైపర్ ఆది తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: డడ్లీ, ప్రొడక్షన్ డిజైన్:ఎ.ఎస్.ప్రకాశ్, కథా పర్యవేక్షణ: సత్యానంద్, సంభాషణలు: తిరుపతి మామిడాల.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
EC - BRS MPs: కారును పోలిన గుర్తులను వేరేవారికి కేటాయించొద్దు: ఈసీకి భారాస ఎంపీల విజ్ఞప్తి
-
Itel: రూ.10 వేలకే 5జీ స్మార్ట్ఫోన్.. 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ
-
Nara Bhuvaneswari: ఇప్పటి వరకు ఏ ఆధారాలూ చూపించలేకపోయారు: నారా భువనేశ్వరి
-
Rohit Sharma: వరల్డ్ కప్లో అశ్విన్ ఉంటాడా..? రోహిత్ శర్మ సమాధానమిదే!
-
Google: 25 వసంతాల గూగుల్.. ప్రత్యేక డూడుల్ షేర్ చేసిన సెర్చ్ ఇంజిన్
-
చిన్నతల్లికి ఎంత కష్టం.. అత్యాచారానికి గురై వీధిలో రక్తమోడుతూ సాయం కోరితే..!