Chandramukhi2: సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘చంద్రముఖి-2’.. రన్‌టైమ్‌ ఎంతంటే?

‘చంద్రముఖి-2’ (Chandramukhi 2) సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది. యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చినట్లు పేర్కొంది.

Published : 23 Sep 2023 15:07 IST

హైదరాబాద్‌: రాఘవ లారెన్స్‌ (Lawrence), కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి 2’. పి.వాసు ఈ సినిమాను తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీని సెన్సార్‌ పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది.

‘జవాన్‌’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్‌ ఖాన్‌

ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు చిత్రబృందం పేర్కొంది. అలాగే దీని ఫైనల్‌ రన్‌టైమ్‌ 157నిమిషాలు (2గంటల 37నిమిషాలు). ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ట్వీట్‌ చేసింది. ఇక లారెన్స్‌ మొదటి పాన్‌ ఇండియా చిత్రంగా ఇది అలరించనుంది. అలాగే బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ఇందులో రాజనర్తకిగా కనిపించనుంది. దీంతో ఈ చిత్రంపై బీటౌన్‌లోనూ ఆసక్తి నెలకొంది. 2005లో రజనీకాంత్‌ , జ్యోతిక, నయనతార నటించిన ‘చంద్రముఖి’ (Chandramukhi) ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ఈ ‘చంద్రముఖి 2’ తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్‌, సాంగ్స్‌ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇప్పటికే ప్రచారంలో జోష్‌ చూపిన మూవీ యూనిట్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు కూడా ముహూర్తం ఖరారు చేసింది.  సెప్టెంబర్‌ 24న ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరగనున్నట్లు తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని