Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
తాజా బ్లాక్ బస్టర్ ‘జవాన్’లో నయనతార నర్మద పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రపై షారుక్ ఆసక్తికర కామెంట్ చేశారు.
ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ప్రస్తుతం ‘జవాన్’ (Jawan) విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా విడుదల రోజు చెప్పినట్లే అభిమానులందరికీ ఆయన స్వయంగా కృతజ్ఞతలు చెబుతున్నారు. ‘జవాన్’ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఫ్యాన్స్ చేసిన ట్వీట్లకు రిప్లైలు ఇస్తూ వారిలో ఆనందం నింపుతున్నారు. తాజాగా ఆయన #AskSRK పేరుతో ఎక్స్‌లో అభిమానులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఓ అభిమాని ‘జవాన్’లో నయనతార (Nayanthara) చేసిన నర్మద పాత్రను ప్రస్తావించారు. ఆ పాత్ర సన్నివేశాలు సినిమాలో అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ ట్వీట్‌కు షారుక్ రిప్లై ఇస్తూ.. నయనతార పాత్ర గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు. ‘‘నర్మద పాత్ర చాలా గొప్పగా ఉంది. దురదృష్టవశాత్తూ సినిమాలో ఆ పాత్ర నిడివి చాలా తక్కువ. కానీ, కనిపించిన కొంతసేపు అద్భుతంగా ఉంది’’ అని అన్నారు. ఇక ‘జవాన్’లో షారుక్ తన డైలాగుల గురించి చెబుతూ..దర్శకులు చెప్పినట్లు తాను చేస్తానని అన్నారు. వాటి కోసం సాధ్యమైనంత ఎక్కువ సమయం తీసుకుని ప్రాక్టీస్ చేస్తానని తెలిపారు. అలాగే తనను ఈ సినిమాలో మరింత అందంగా చూపించిన స్టైలిష్లకు ప్రత్యేక గిఫ్ట్ ఇస్తానని కూడా ఆయన (Shah Rukh Khan) చెప్పారు.
అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
ఇక మరోవైపు ‘జవాన్’ (Jawan) సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ రూ.955 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఇందులోని షారుక్ విభిన్న లుక్స్, యాక్షన్ విజువల్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కథానాయికగా నయనతార, ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి, ఇతర కీలక పాత్రల్లో ప్రియమణి, సాన్యా మల్హోత్ర, దీపికా పదుకొణె తదితరులు ఆకట్టుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Trisha: నెటిజన్ల విమర్శలు.. ‘యానిమల్’పై పోస్ట్ తొలగించిన త్రిష
నెటిజన్ల నుంచి వస్తోన్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని ‘యానిమల్’ (Animal)పై పెట్టిన పోస్ట్‌ను నటి త్రిష (Trisha) తొలగించారు. -
Nani: మణిరత్నం సినిమాలు చూసి చాలా టెక్నిక్స్ నేర్చుకున్నా : నాని
నాని నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’(Hi Nanna). ఈ సినిమా ప్రమోషన్స్‌తో ఆయన బిజీగా ఉన్నారు. -
Allu Aravind: అతడు మా కుటుంబంలో ఎవరికీ పీఆర్వో కాదు: అల్లు అరవింద్
ఇటీవల గోవా వేదికగా జరిగిన ఓ అవార్డుల కార్యక్రమం ప్రస్తుతం చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పలువురు కన్నడ నటీనటులు తెలుగు చిత్ర పరిశ్రమను తప్పుబట్టడంపై నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) స్పందించారు. -
Kriti Sanon: ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం.. చట్టపరమైన చర్యలు తీసుకున్న కృతి సనన్
తాను ట్రేడింగ్ మాధ్యమాల గురించి మాట్లాడలేదని నటి కృతి సనన్ (Kriti Sanon) స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలపై జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. -
Animal: కన్నీళ్లు పెట్టుకున్న బాబీ దేవోల్.. వీడియో వైరల్
‘యానిమల్’ సినిమాలో విలన్‌గా ప్రేక్షకులను ఆకట్టకున్నారు బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ (Bobby Deol). ఈ సినిమా విజయం సాధించడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. -
Social Look: క్యూట్ ట్రైనర్‌తో మహేశ్ బాబు.. మీనాక్షి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Animal: రణ్‌బీర్‌తో వర్క్.. త్రిప్తి డిమ్రి ఏమన్నారంటే..?
‘యానిమల్’ (Animal)లో రణ్‌బీర్ (Ranbir Kapoor)తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై నటి త్రిప్తి డిమ్రి (Tripti dimri) స్పందించారు. ఆయనతో మరోసారి వర్క్ చేయాలని ఉందన్నారు. -
Nagarjuna: నాగచైతన్యను మెచ్చుకున్న నాగార్జున..!
నాగచైతన్య (Naga Chaitanya) నటించిన ‘దూత’ (Dhootha) సిరీస్‌ను తాజాగా నాగార్జున (Nagarjuna) వీక్షించారు. సిరీస్ తనకెంతో నచ్చిందన్నారు. -
Social Look: ఓవర్ థింకింగ్ సీఈవో జాన్వి.. గాయాలతో కల్యాణి
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు.. -
Aamir Khan: ‘లాల్‌సింగ్ చడ్డా’ ఫ్లాప్.. ఆమిర్‌ఖాన్ ఎంతో బాధపడ్డారు..!
‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) పరాజయం తర్వాత ఆమిర్‌ఖాన్ (Aamir Khan) ఎంతో బాధపడ్డారని బాలీవుడ్ నటుడు, క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ తెలిపారు. -
Animal: రణ్‌బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ‘యానిమల్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే!
రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘యానిమల్’ (Animal) తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. మంచి కలెక్షన్లతో రణ్ బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. -
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
సిల్క్ స్మిత (Silk Smita) జీవితాన్ని ఆధారంగా చేసుకుని నూతన దర్శకుడు జయరామ్ ఓ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఇది విడుదల కానుంది. -
Sathya: హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై సాయి ధరమ్ తేజ్ షార్ట్ ఫిల్మ్
సాయి ధరమ్ తేజ్ షార్ట్ ఫిల్మ్ ‘సత్య’ను (Satya) హాలీవుడ్లో జరగనున్న ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. -
Trivikram: పుస్తకం ఎందుకు చదవాలంటే.. త్రివిక్రమ్ మాటల్లో..!
దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. పుస్తకం చదవడం ఎంత ఉపయోగమో చెప్పారు. -
Naga Chaitanya: ఆ తర్వాత పట్టించుకోను: పర్సనల్ లైఫ్‌పై నాగచైతన్య కామెంట్స్
పనిపైనే తాను దృష్టి పెట్టినట్లు హీరో నాగచైతన్య తెలిపారు. ఇకపై తన సినిమాలే మాట్లాడతాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. -
Social Look: చీరలో మెరిసిన త్రిష.. పూజ క్విక్ పిక్..!
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు.. -
Siddharth: అదితిరావు హైదరీతో పెళ్లి.. సిద్ధార్థ్ ఏమన్నారంటే?
నటి అదితిరావు హైదరీ (Aditi Rao hydari)తో తనకున్న స్నేహం గురించి నటుడు సిద్ధార్థ్ (Siddharth) మాట్లాడారు. అదితితో తన వివాహమంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన స్పందించారు. -
కిస్ సీన్స్ కాంట్రవర్సీ.. స్పందించిన సందీప్ రెడ్డి వంగా
‘యానిమల్’ (Animal) ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఇందులో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గత చిత్రం ‘కబీర్‌సింగ్’ (Kabir Singh) గురించి ఆయన మాట్లాడారు. -
Rishab Shetty: నేను చెప్పింది ఇప్పటికి అర్థం చేసుకున్నారు.. తన స్పీచ్‌పై రిషబ్ శెట్టి పోస్ట్
రిషబ్ శెట్టి (Rishab Shetty) తాజా స్పీచ్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై ఓ అభిమాని పెట్టిన పోస్ట్‌కు రిషబ్ స్పందించారు. -
Malavika Mohanan: డబ్బింగ్ అంటే నాకు భయం..: మాళవికా మోహనన్
విక్రమ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). ఈ సినిమా గురించి మాళవికా మోహనన్ పోస్ట్ పెట్టారు. -
Tollywood: సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత
సీనియర్ నటి ఆర్ సుబ్బలక్ష్మి (R Subbalakshmi)కన్నుమూశారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.


తాజా వార్తలు (Latest News)
-
Trisha: నెటిజన్ల విమర్శలు.. ‘యానిమల్’పై పోస్ట్ తొలగించిన త్రిష
-
Revanth Reddy: తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి
-
Bigg boss telugu 7: ఆటలు ఆడకపోయినా అందుకే శివాజీ హౌస్‌లో ఉంటున్నారు: గౌతమ్‌కృష్ణ
-
Hamas: 200 హమాస్ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం
-
Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు నిలిపివేత
-
Andhra Pradesh: తీవ్ర తుపానుగా మిగ్జాం.. ఈ జిల్లాల్లో తీవ్ర ప్రభావం