‘చెక్‌’మేట్‌తో ఒక డ్యూయెట్‌!

చంద్రశేఖర్‌ యేలేటి, నితిన్‌ కాంబోలో వస్తున్న ఆసక్తికర చిత్రం ‘చెక్‌’. తాజాగా ఇందులోని ఒక డ్యూయెట్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ‘నిన్ను.. చూడలేక పోతున్నాను..’అంటూ సాగుతున్న  పాటలో నితిన్‌, ప్రియా వారియర్‌ రొమాన్స్‌ చేశారు. ఈ

Published : 18 Feb 2021 01:49 IST

హైదరాబాద్‌: చంద్రశేఖర్‌ యేలేటి, నితిన్‌ కాంబోలో వస్తున్న ఆసక్తికర చిత్రం ‘చెక్‌’. తాజాగా ఇందులోని ఒక డ్యూయెట్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ‘నిన్ను.. చూడలేక పోతున్నాను..’అంటూ సాగుతున్న  పాటలో నితిన్‌, ప్రియా వారియర్‌ రొమాన్స్‌ చేశారు. ఈ గేయానికి శ్రీమణి సాహిత్యం అందించగా కల్యాణ్‌మాలిక్‌ స్వరాలు సమకూర్చారు. హరిచరణ్‌, శక్తిశ్రీ గోపాలన్‌ ఆలపించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ‘ట్రైలర్‌’సినిమాపై ఆసక్తి మరింత పెంచుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సాయిచంద్‌, సంపత్‌ రాజ్‌, హర్షవర్థన్‌ వంటి ప్రముఖ నటులు ఉన్న ఈ చిత్రాన్ని భవ్యక్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. చెస్ గేమ్‌ నేపథ్యంగా వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 26న థియేటర్లలో సందడి చేయనుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని