
Radheshyam: ‘రాధేశ్యామ్’.. సంచారి వీడియో వచ్చేసింది..!
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ నుంచి సరికొత్త వీడియో సాంగ్ వచ్చేసింది. ‘సంచారి ఛల్ ఛలో’ అంటూ సాగే ఈ పాటలో ప్రభాస్.. జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించిన యువకుడిగా కనిపించారు. ఆయన యంగ్ లుక్‌లో అదరగొట్టేశారు. యూరప్ వీధుల్లో , మంచు కొండల్లో ఎంతో హుషారుగా కనిపించారు. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. పూజాహెగ్డే కథానాయిక. ఇందులో ప్రభాస్ లవర్‌బాయ్ పాత్రలో కనిపించనున్నారు. హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో విక్రమాదిత్యగా మెప్పించనున్నారు. పూజా ప్రేరణ పాత్రలో ఆకట్టుకోనున్నారు. విక్రమాదిత్య.. ప్రేరణను సొంతం చేసుకోగలిగాడా? లేదా? వారి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తికర కథాంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకొంది. వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది.
► Read latest Cinema News and Telugu News