Project K: ‘ప్రాజెక్ట్‌ కె’.. దీపికా పదుకొణె ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది

సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) ఒకటి. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న దీపికా పదుకొణె లుక్‌ విడుదలైంది.

Published : 18 Jul 2023 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర బృందం తాజాగా ఆమె ఫస్ట్‌లుక్‌ని సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది.

సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రకటన వెలువడిన క్షణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కోలీవుడ్‌ అగ్ర నటుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) భాగం కావడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. వీరితోపాటు బాలీవుడ్‌ నటి దిశా పటానీ (Disha Patani) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ ఎప్పుడు చెబుతారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి అతి త్వరలోనే సమాధానం లభించనుంది.

ఎన్టీఆర్‌తో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’లాంటి మూవీ.. అలా‘శక్తి’గా మారిపోయింది!

ఈ నెల 20న ప్రారంభం కానున్న ‘శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌’ వేడుకల్లో చిత్ర బృందం పాల్గొని టైటిల్‌, ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమా రిలీజ్‌ డేట్‌ని చెప్పనుంది.‘‘ఈ ప్రపంచం మొత్తం అత్యంత ఆసక్తికర షో కోసం వేచి చూస్తోంది. ప్రాజెక్ట్‌-కె ప్రపంచాన్ని పరిచయం చేసుకునేందుకు మీరు సిద్ధంగా ఉండండి. జులై 20 (యూఎస్‌ఏ) జులై 21 (ఇండియా)’’ అని చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం తెలిపింది. కామిక్‌ కాన్‌ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్‌ కె’ చరిత్ర సృష్టించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని