Devil: విడుదలైన రెండువారాలకే ఓటీటీలోకి ‘డెవిల్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) హీరోగా నటించిన ‘డెవిల్‌’ (Devil) ఓటీటీ స్ట్రీమింగ్‌కు డేట్‌ ఫిక్స్‌ అయ్యింది.

Updated : 13 Jan 2024 17:30 IST

హైదరాబాద్‌: క‌ల్యాణ్‌రామ్ (Kalyan Ram) క‌థానాయ‌కుడిగా న‌టించిన స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్‌’ (Devil). అభిషేక్‌ నామా దర్శకుడు. సంయుక్త మేనన్‌ కథానాయిక. డిసెంబర్‌ 29న విడుదలై మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా జనవరి 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 

Salaar: ‘సలార్‌’ సక్సెస్‌ పార్టీ.. వీడియోలు వైరల్‌

డెవిల్‌ కథేంటంటే: 1940 ద‌శ‌కంలో సాగే క‌ల్పిత క‌థ ఇది. స్వాతంత్ర్యం కోసం పాటుపడిన సుభాష్ చంద్ర‌బోస్‌ని ప‌ట్టుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో ఉంటుంది   ఆనాటి బ్రిటిష్ ప్ర‌భుత్వం. ఆ స‌మ‌యంలోనే బ్రిటిష్ ప్ర‌భుత్వంలో సీక్రెట్ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంటాడు డెవిల్ (క‌ల్యాణ్‌రామ్‌). ర‌స‌పురంలోని జ‌మిందార్ ఇంట్లో జ‌రిగిన ఓ హ‌త్య కేసుని ఛేదించ‌డానికి ప్ర‌భుత్వం అతడిని పంపుతుంది.  కేసు దర్యాప్తులో సుభాష్ చంద్ర‌బోస్ నేతృత్వంలో న‌డుస్తున్న ఐఎన్ఏ (ఇండియ‌న్ నేష‌న‌ల్ ఆర్మీ) ఏజెంట్ల‌ను గుర్తిస్తాడు డెవిల్‌. మరోవైపు, బోస్.. తన కుడి భుజ‌మైన త్రివ‌ర్ణతో టచ్‌లో ఉన్న విష‌యాన్ని డెవిల్‌ ప‌సిగ‌డ‌తాడు (devil movie review). సుభాష్ చంద్ర‌బోస్‌కి కోడ్ రూపంలో ఓ సమాచారాన్ని చేర‌వేసేందుకు త్రివర్ణ, మ‌రికొద్ది మంది ఐఎన్ఏ ఏజెంట్లు ప్రయత్నిస్తుంటారు. మ‌రి ఆ కోడ్‌తో జ‌మిందార్ ఇంట్లో హ‌త్య‌కు సంబంధం ఏమిటి? ఎన్నో చిక్కుముడులున్న ఈ కేసుని డెవిల్ ఎలా ఛేదించాడు? అస‌లు ఈ క‌థ‌లో త్రివ‌ర్ణ ఎవ‌రు? నైష‌ధ (సంయుక్త‌), మ‌ణిమేక‌ల (మాళ‌విక నాయ‌ర్‌)తో ఆమెకు సంబంధం ఏమిటి? బోస్‌ని బ్రిటిష్ ప్ర‌భుత్వం ప‌ట్టుకుందా? వంటి అంశాలతో ‘డెవిల్‌’ సిద్ధమైంది. దీనికి కొనసాగింపుగా ‘డెవిల్‌ 2’ను తెరకెక్కిస్తామని కల్యాణ్‌రామ్‌ ఇటీవల ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని