Captain Miller: యుద్ధభూమిలో కెప్టెన్‌ మిల్లర్‌

‘కెప్టెన్‌ మిల్లర్‌’గా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు ధనుష్‌. ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కిస్తున్నారు.

Updated : 01 Jul 2023 07:23 IST

‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller)గా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు ధనుష్‌ (Dhanush). ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కిస్తున్నారు. సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. అందులో ధనుష్‌ మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన లూయిస్‌ మెషిన్‌ గన్‌ను చేతిలో పట్టుకొని యుద్ధభూమిలో నిల్చొని కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో వేలాది మంది సైనికులు విగత జీవులై పడి ఉన్నారు. 1930-40ల మధ్య కాలంలో జరిగిన ఆసక్తికర కథాంశంతో యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ధనుష్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రమిది. సందీప్‌ కిషన్‌, శివ రాజ్‌కుమార్‌, ప్రియాంక మోహన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌, ఛాయాగ్రహణం: శ్రేయాస్‌ కృష్ణ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని