వాళ్లందరికీ ‘నాంది’ అంకితం

ఒక మంచి సినిమా తీస్తే పురస్కారాలే కాదు... డబ్బు,  గౌరవమూ వస్తుంది’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు. ఆయన ‘నాంది’ చిత్రబృందం కోసం మంగళవారం హైదరాబాద్‌లో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు....

Published : 24 Feb 2021 11:30 IST

హైదరాబాద్‌: ‘‘ఒక మంచి సినిమా తీస్తే పురస్కారాలే కాదు... డబ్బు,  గౌరవమూ వస్తుంది’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు. ఆయన ‘నాంది’ చిత్రబృందం కోసం మంగళవారం హైదరాబాద్‌లో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అల్లరి నరేష్‌ కథానాయకుడిగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘సినిమాతో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఇంత మంచి సినిమా చేసిన చిత్రబృందాన్ని అభినందించాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశా’’ అన్నారు. అల్లరి నరేష్‌ మాట్లాడుతూ ‘‘నాకు విజయం దక్కాలని చాలా మంది కోరుకున్నారు. వాళ్లందరికీ ఈ సినిమాని అంకితం చేస్తున్నా’’నన్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌తోపాటు, ఇతర చిత్రబృందం పాల్గొంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని