Dulquer Salmaan: అసలైన పాన్‌ ఇండియా స్టార్‌ దుల్కర్‌

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా అభిలాష్‌ జోషి తెరకెక్కించిన బహుభాషా చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’. జీ స్టూడియోస్‌, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఐశ్వర్య లక్ష్మీ కథానాయిక. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 14 Aug 2023 11:28 IST

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ వేడుకలో నాని

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా అభిలాష్‌ జోషి తెరకెక్కించిన బహుభాషా చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ (King Of Kotha). జీ స్టూడియోస్‌, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఐశ్వర్య లక్ష్మీ కథానాయిక. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర విడుదల ముందస్తు వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. రానా, నాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నాని మాట్లాడుతూ ‘‘పాన్‌ ఇండియా సినిమా అనే పదం నాకు నచ్చదు. కానీ నాకు తెలిసి అసలైన పాన్‌ ఇండియా స్టార్‌ అంటే దుల్కర్‌ మాత్రమే. ఆయన కోసం అన్ని భాషల దర్శకులు కథలు సిద్ధం చేసుకుంటుంటారు. ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ ట్రైలర్‌ చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’అని చెప్పారు. రానా మాట్లాడుతూ ‘‘దుల్కర్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో నాకు జూనియర్‌. చాలా పద్ధతిగా ఉండే వ్యక్తి. అలాంటి దుల్కర్‌ ఇప్పుడు ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ లాంటి  వైల్డ్‌ యాక్షన్‌ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది’’అన్నారు. దుల్కర్‌ మాట్లాడుతూ ‘‘కింగ్‌ ఆఫ్‌ కోథా నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. నేను ఎంతో నమ్మి చేసిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఇది. మీ అందరికీ ఈ చిత్రం నచ్చుతుంది’’అన్నారు. హిందీలో ఓ ప్రేమ కథా చిత్రం చేయాల్సి వస్తే మీ పక్కన కథానాయికగా ఎవరు నటిస్తే బాగుంటుంది? అనే ప్రశ్నకు ‘అలియా భట్‌’ అని సమాధానం చెప్పారు దుల్కర్‌. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య లక్ష్మీ, అనికా సురేంద్రన్‌, స్రవంతి రవికిషోర్‌, ముఖేష్‌ మెహతా, షబ్బీర్‌, నిమ్మకాయల ప్రసాద్‌, తరుణ్‌ తండన్‌, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని