భార్యాభర్తల ప్రేమకథ

వి.జె.సన్నీ, శ్రీతేజ్‌, ఆషిమా నర్వాల్‌, తరుణీసింగ్‌ ప్రధాన పాత్రధారులుగా వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సకల గుణాభిరామ’. సంజీవరెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకుని     విడుదలకి సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్‌, పాటల విడుదల   కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.

Published : 06 Feb 2022 01:44 IST

వి.జె.సన్నీ, శ్రీతేజ్‌, ఆషిమా నర్వాల్‌, తరుణీసింగ్‌ ప్రధాన పాత్రధారులుగా వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సకల గుణాభిరామ’. సంజీవరెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకుని     విడుదలకి సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్‌, పాటల విడుదల   కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి, సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ పాటల్ని విడుదల చేయగా... దర్శకుడు అనిల్‌ రావిపూడి, కథానాయకుడు విశ్వక్‌సేన్‌ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘సన్నీ ఎప్పుడూ ఒదిగి ఉంటాడు. నిర్మాతలకి ఇది తొలి సినిమా అయినా వారికి ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.    దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘‘భార్యాభర్తల   ప్రేమకథతో సినిమా తీద్దామని నిర్మాతలకి ఈ కథ చెప్పా. వాళ్లకి బాగా నచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు చక్కటి సహకారం అందించారు. పాటలు అద్భుతంగా ఉంటాయి. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. కథానాయకుడు వి.జె.సన్నీ మాట్లాడుతూ ‘‘ప్రతి మనిషికీ జీవితంలో ఎక్కువమంది ఉండాల్సింది స్నేహితులే. నేను హీరో కావాలనేదే వాళ్ల కల. ‘హ్యాపీడేస్‌’లో రాజేష్‌ పాత్రని నేనే చేయాలి కానీ, అప్పుడు మిస్‌ అయ్యింది. వెలిగొండ శ్రీనివాస్‌ నా ప్రతిభని గుర్తించి ఇందులో నటించే అవకాశం ఇచ్చారు. బిగ్‌బాస్‌ షోతో నన్ను ప్రేక్షకులు అక్కున చేర్చుకుని, నా విజయానికి కారకులయ్యారు. ఇక నుంచి మరిన్ని మంచి సినిమాలు చేస్తా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్‌సందేశ్‌, శివారెడ్డి, నిర్మాత వివేక్‌, అనుదీప్‌, ఆషిమా, తరుణి, రఘురాం, సింహాచలం, శ్రీతేజ్‌, మానస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని