పేరు చిన్ని.. చేసిన హత్యలు 24!

‘మహానటి’ తర్వాత వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ వస్తోంది నటి కీర్తి సురేష్‌. ఇప్పుడీ క్రమంలోనే ‘సాని కాయిదం’తో థ్రిల్‌ చేసేందుకు సిద్ధమైంది. అరుణ్‌  మాతేశ్వరన్‌ తెరకెక్కించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది.  

Published : 27 Apr 2022 03:09 IST

‘మహానటి’ తర్వాత వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ వస్తోంది నటి కీర్తి సురేష్‌. ఇప్పుడీ క్రమంలోనే ‘సాని కాయిదం’తో థ్రిల్‌ చేసేందుకు సిద్ధమైంది. అరుణ్‌  మాతేశ్వరన్‌ తెరకెక్కించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది.   దర్శకుడు సెల్వ రాఘవన్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తెలుగులో ‘చిన్ని’గా విడుదల కానుంది. ఈ చిత్రం మే 6న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానున్న నేపథ్యంలో.. మంగళవారం ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో కీర్తి సఖినేటి పల్లికి చెందిన కానిస్టేబుల్‌ చిన్ని అనే పాత్రలో కనిపించనుంది. సెల్వరాఘవన్‌ చినగంజాంకు చెందిన రంగయ్య అనే పాత్రలో కనిపించనున్నారు. 24 మందిని హత్య చేసినందుకు ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్‌ చేయడం.. వారిని విచారిస్తున్న క్రమంలో ఆసక్తికర విషయాలు బయటకు రావడం.. వంటివి ట్రైలర్‌లో చూపించారు. డీగ్లామర్‌ లుక్‌లో కీర్తి కనిపించిన విధానం,  హావభావాలు.. కొత్తగా ఉన్నాయి.ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సిఎస్‌, ఛాయాగ్రహణం: యామిని యజ్ఞమూర్తి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని