Cinema news: ఇప్పటికీ నమ్మలేకపోతున్నా

‘‘నేను గౌతమ్‌ మేనన్‌ హీరోయిన్‌ అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా..’’ అంటోంది నటి సిద్ధి ఇద్నాని. ‘జంబ లకిడి పంబ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఇప్పుడు ‘వెందు తనిందతు కాదు’ సినిమాతో తమిళ చిత్రసీమకు పరిచయమవుతోంది.

Published : 09 Aug 2022 03:44 IST

‘‘నేను గౌతమ్‌ మేనన్‌ హీరోయిన్‌ అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా..’’ అంటోంది నటి సిద్ధి ఇద్నాని. ‘జంబ లకిడి పంబ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఇప్పుడు ‘వెందు తనిందతు కాదు’ సినిమాతో తమిళ చిత్రసీమకు పరిచయమవుతోంది. శింబు హీరోగా నటిస్తున్న చిత్రమిది. గౌతమ్‌ మేనన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. తాజాగా ఈ చిత్రంలో తన పాత్ర పావైకు డబ్బింగ్‌ పూర్తి చేసినట్లు సిద్ధి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. ‘‘పావై డబ్బింగ్‌కు ఇది ఒక ముగింపు. నన్ను నమ్మి నాకే డబ్బింగ్‌ చెప్పుకోవడానికి అనుమతించినందుకు గౌతమ్‌కు థ్యాంక్స్‌. నా కల నిజమైంది. నేను గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ హీరోయిన్‌ అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా’’ అంటూ ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇదొక విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌. సెప్టెంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని