Gautham Menon: ‘ఛెల్లో షో’ సరైన ఎంపికే కావొచ్చు
డా.విశ్వానంద్ పటార్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘లాట్స్ ఆఫ్ లవ్’. ఆద్య, నిహాంత్, దివ్య, రాజేష్, భావన ఇతర నాయకానాయికలు. ఈ నెల 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
‘ఛెల్లో షో’ (Chhello Show) భారత్ తరపున అధికారికంగా ఆస్కార్ (Oscars) బరిలో దిగుతోంది అని ప్రకటించినప్పటి నుంచీ.. ఇది సరైన ఎంపిక కాదంటూ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పరిశ్రమకు చెందిన ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’కు ఎంట్రీ దక్కకపోవడంపై కూడా హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ పలువురు పెదవి విరిచారు. కానీ తమిళ అగ్ర దర్శకుడు గౌతమ్ మేనన్ (Gautham Menon) మాత్రం ‘ఛెల్లో షో’కి కాస్త సపోర్ట్‌గానే మాట్లాడారు. ఆయన పరిశ్రమలోకి వచ్చి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు గౌతమ్. ఈ సందర్భంగా విలేకరులు ఈ ఏడాది ఆస్కార్ ఎంపిక గురించి అడిగారు. ఆ విషయంపై స్పందిస్తూ ‘అన్ని అర్హతలున్న చిత్రాన్నే తప్పకుండా ఎంపిక చేయాల్సింది. ‘ఛెల్లో షో’ని నేను ఇంతవరకు చూడలేదు. ఎంపిక కమిటీలో అనుభవజ్ఞులు, మేధావులున్నారు. ప్రత్యేకంగా ఆ సినిమానే తీసుకున్నారంటే తప్పకుండా ఏదో కారణం ఉంటుంది. త్వరలోనే ఆ చిత్రాన్ని చూస్తాను’ అన్నారు.
ఐదు కథలతో...
డా.విశ్వానంద్ పటార్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘లాట్స్ ఆఫ్ లవ్’ (Lots Of Love). ఆద్య, నిహాంత్, దివ్య, రాజేష్, భావన ఇతర నాయకానాయికలు. ఈ నెల 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక నిర్వహించారు. విశ్వానంద్ మాట్లాడుతూ ‘‘ఐదు కథల సమాహారం ఈ చిత్రం. కొవిడ్ సమయంలో చిత్రీకరించాం. ఎన్నో కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పూర్తి చేశాం. మహిళలు, పిల్లలకి ఇది పక్కాగా నచ్చుతుంది. టికెట్ ధరల్నీ తగ్గిస్తున్నాం’’ అన్నారు. ‘‘పేరుకు తగ్గట్టే చాలా ప్రేమని నింపుకుని చేసిన చిత్రమిది. కథలోనూ ఆ ప్రేమ కనిపిస్తుంది’’ అన్నారు కథానాయకుల్లో ఒకరైన రాజేష్. ‘‘తెలుగు రాష్ట్రాల్లో వంద థియేటర్లలో, అమెరికాలో 4 థియేటర్లలో విడుదల చేస్తున్నామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో శ్రీరంగం సతీష్, ప్రత్తిపాటి శ్రీనివాసరావు, సోమేశ్వర్రాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్‌లో సెట్లోకి
గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్‌లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు