Rajamouli: ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి పేరు హాలీవుడ్లో మార్మోగుతోంది. ఆయన తీసిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకొంటోంది.
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ పురస్కారం
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (Rajamouli) పేరు హాలీవుడ్లో మార్మోగుతోంది. ఆయన తీసిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకొంటోంది. అమెరికాలో ఇటీవల నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనల తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి, ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళికీ మరింతగా అభిమానులు పెరిగారు. ఆస్కార్ పురస్కారాల్లో ఫేవరేట్‌గా నిలుస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రానికిగానూ, ప్రతిష్ఠాత్మకమైన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (ఎన్.వై.ఎఫ్.సి.సి) పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికయ్యారు. ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేసింది సదరు సంస్థ. ఈ పురస్కారాన్ని అందుకున్న ఎక్కువమంది దర్శకులు ఆస్కార్ విజేతలుగా నిలిచినట్టు హాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజమౌళికి పురస్కారం పట్ల సామాజిక అనుసంధాన వేదికల్లో అభినందనలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ ట్విటర్లో స్పందిస్తూ ‘మీ గురించి నాకు తెలిసింది ప్రపంచం కూడా తెలుసుకోవల్సిన సమయం ఇది. ప్రపంచవ్యాప్తంగా సాగనున్న మీ కీర్తి ప్రయాణానికి ఇది ఆరంభం మాత్రమే. అభినందనలు జక్కన్నా’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ కల్పిత కథతో రూపొందించారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింపజేస్తాం
‘బాహుబలి’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేటెడ్ సిరీస్ ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’. దీనికి జీవన్ జె.కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. -
ఊరిస్తున్న ఎన్టీఆర్
‘దేవర’ ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించారు ఎన్టీఆర్. ‘వార్ 2’ కోసం హిందీలోకి అడుగుపెట్టి.... ఆ కొత్త ప్రయాణం గురించీ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేశారు. ఆయన పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో మరోసారి ‘దేవర’ ప్రచార చిత్రాలు కానీ, పాటతో కానీ హంగామా చేయొచ్చని పరిశ్రమ, అభిమాన వర్గాల అంచనా. -
తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ మలుపు... ఆర్య
‘‘తెలుగు సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్. -
మెరుపుల తార.. తళుకుల చీర
అందం, నటనతో అలరిస్తున్న బాలీవుడ్ అగ్రనాయిక అలియా భట్ ఈసారి ఆకట్టుకునే వస్త్రధారణతో అంతర్జాతీయ యవనికపై అలరించింది. ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక ‘మెట్ గలా’లో ఆమె చీరలో మెరిసింది. -
రోడ్లన్నీ గతుకులపాలే.. ఊరంతా చీకటిపాలే
ఓట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘డియర్ స్టూడెంట్స్’ సందడి మొదలు
ఇటీవలే ‘డియర్ స్టూడెంట్స్’ అగ్రతార నయనతారకు స్వాగతం పలికారు. ఈమె, నివిన్ పౌలీ జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రమిది. సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్రాయ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. -
జులై 20న... కౌలాలంపూర్‌లో
తెలుగు సినిమా వైభవాన్ని... వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని చెప్పారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్, బుకిట్ జలీల్‌లోని ప్రతిష్ఠాత్మక నేషనల్ స్టేడియంలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
తెరపై యుద్ధం.. ఖర్చు రూ.8కోట్లు
‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఇప్పుడు ‘స్వయంభూ’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్‌ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్