దసరాకి రామ్‌ సందడి

రామ్‌ పోతినేని కథానాయకుడిగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా విడుదల తేదీ ఖరారైంది. అక్టోబరు 20న వస్తున్నాం అని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు కథానాయకుడు రామ్‌.

Published : 28 Mar 2023 03:02 IST

రామ్‌ పోతినేని కథానాయకుడిగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా విడుదల తేదీ ఖరారైంది. అక్టోబరు 20న వస్తున్నాం అని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు కథానాయకుడు రామ్‌. ప్రేక్షకుల్లో అంచనాల్ని రేకెత్తిస్తున్న మాస్‌ కలయికలో రూపొందుతున్న సినిమా ఇది. విజయవంతమైన ‘అఖండ’ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే. రామ్‌కి జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా సందడిలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు