Sai Pallavi: సీతగా సాయిపల్లవి?

కథ ఎంపికలో ఆచితూచి అడుగులేసే సాయిపల్లవి ఇప్పుడు వేగం పెంచుతోంది. వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

Updated : 09 Oct 2023 07:21 IST

కథ ఎంపికలో ఆచితూచి అడుగులేసే సాయిపల్లవి(Sai Pallavi) ఇప్పుడు వేగం పెంచుతోంది. వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో, తమిళంలో శివ కార్తికేయన్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామె ఓ భారీ హిందీ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. రామాయణం ఇతివృత్తంతో దర్శకుడు నితీశ్‌ తివారి హిందీలో ఓ సినిమా రూపొందించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ కనిపించనుండగా.. సీత పాత్రను సాయిపల్లవి పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం ఆమెతో చర్చలు జరిపిందని.. సానుకూలంగా స్పందించిందని తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్‌. ఇందులో రావణుడి పాత్ర కోసం యశ్‌ను రంగంలోకి దించనున్నారని పచారం వినిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని