Sharwanand: శర్వానంద్.. మరో కబురు
రక్షితా రెడ్డితో త్వరలో ఏడడుగులు వేయనున్నారని శర్వానంద్ (Sharwanand) ఇటీవలే పెళ్లి కబురు వినిపించారు. మరోవైపు మార్చి నుంచి తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.
రక్షితా రెడ్డితో త్వరలో ఏడడుగులు వేయనున్నారని శర్వానంద్ (Sharwanand) ఇటీవలే పెళ్లి కబురు వినిపించారు. మరోవైపు మార్చి నుంచి తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడాయన మరో దర్శకుడితోనూ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపారని సమాచారం. ‘118’ చిత్రంతో సినీ ప్రియుల్ని మెప్పించారు కె.వి.గుహన్. ఆయన ఇటీవలే శర్వాకు ఓ కథ వినిపించారని.. అది నచ్చడంతో ఆ ప్రాజెక్టు చేసేందుకు పచ్చజెండా ఊపారని తెలిసింది. దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. శ్రీరామ్ ఆదిత్య చిత్రం పూర్తయ్యాకే ఈ సినిమా పట్టాలెక్కనుందని టాక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
iPhone: యాపిల్ యూజర్లకు కేంద్రం వార్నింగ్
-
Atlee: హాలీవుడ్ నుంచి కాల్ వచ్చింది.. స్పానిష్ ఫిల్మ్ తీయొచ్చేమో: ‘జవాన్’ డైరెక్టర్
-
Chandrababu Arrest: ముగిసిన చంద్రబాబు రెండ్రోజుల సీఐడీ కస్టడీ
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
PM Modi: హైదరాబాద్ బాలికను ప్రశంసించిన ప్రధాని
-
Ban vs NZ: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ వెల్లివిరిసిన క్రీడాస్ఫూర్తి.. వీడియో వైరల్