Kajal: ఓటీటీలోకి వచ్చేసిన కాజల్‌ కొత్త సినిమా.. కండిషన్‌ అప్లై..!

అగ్ర కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) కీలక పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘కరుంగాపియం’. తమిళంలో తెరకెక్కిన ఈసినిమా ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది.

Published : 10 Jul 2023 19:32 IST

హైదరాబాద్‌: కాజల్‌ అగర్వాల్‌ (kajal), రెజీనా (Regina) ప్రధాన పాత్రల్లో నటించిన కోలీవుడ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘కరుంగాపియం’ (Karungaapiyam). కార్తికేయన్‌ (డీకే) తెరకెక్కించిన ఈ సినిమా మే 19న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడిదే సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నేటి నుంచి ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ చిత్రాన్ని వీక్షించడానికి అందరికీ వీలు లేదు. రెంట్‌లో ఉన్న దీనిని రూ.99 చెల్లించిన తర్వాతనే ప్రేక్షకులు చూడగలరు.

కథేంటంటే:

కార్తిక (రెజీనా).. కాలక్షేపం కోసం ఓ పాత లైబ్రరీకి వెళ్తుంది. అక్కడ ఆమెకు వందేళ్ల క్రితం రాసిన ‘కాటుక బొట్టు’ అనే పుస్తకం కనిపిస్తుంది. పురాతన గ్రంథంలా కనిపించిన ఆ పుస్తకాన్ని చూసిన వెంటనే ఆమెకు చదవాలనిపిస్తుంది. అయితే, ఆమె పుస్తకంలో చదివే పాత్రలన్నీ దెయ్యాలుగా మారి ఒక్కొక్కటిగా తన ముందుకు వస్తుంటాయి. అలా, ఆమె ముందుకు వచ్చిన ఓ పాత్ర కార్తిక (కాజల్‌). గ్రామస్థుల వల్ల మరణించిన కార్తిక పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటుంది. మరి, ఆమె పగ ఎలా తీరింది..? కార్తిక (రెజీనా), కథలో ఉన్న కార్తిక (కాజల్‌)కు ఉన్న సంబంధం ఏమిటి..? అనే ఆసక్తికర విషయాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఇక, దీన్నే ‘కార్తీక’ అనే పేరుతో జులై 7న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని