Kangana Ranaut: మీ ముందుకు ‘సీత’గా వస్తున్నా!
‘‘సీత: ది ఇంకార్నేషన్’’ చిత్రంలో సీత పాత్రలో ఎవరు నటించనున్నారనే సందేహం తొలిగిపోయింది. ఇటీవలే విడుదలైన ‘‘తలైవి’లో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితగాథ పాత్రలో నటించి మెప్పించిన కంగనారనౌత్ తాజాగా తన తదుపరి చిత్రం గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు.
ముంబయి: ‘‘సీత: ది ఇంకార్నేషన్’’ చిత్రంలో సీత పాత్రలో ఎవరు నటించనున్నారనే సందేహం తొలిగిపోయింది. ఇటీవలే విడుదలైన ‘‘తలైవి’లో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితగాథ పాత్రలో నటించి మెప్పించిన కంగనారనౌత్ తాజాగా తన తదుపరి చిత్రం గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. ‘‘సీత: ది ఇంకార్నేషన్’’ చిత్రంలో సీత పాత్రలో కనిపించబోతున్నాను అని తెలిపింది. ప్రముఖ సినీ రచయిత కెవీ విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి, అలౌకిక్ దేశాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఏ హ్యూమన్ బీయింగ్ స్టూడియో ప్రొడక్షన్స్ పతాకంపై ‘సీత’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనోజ్ ముంతాషీర్ సాహిత్య, సంభాషణలు సమకూరుస్తున్నారు.
అయితే గతంలో ఈ చిత్రంలో కరీనా కపూర్ నటించనుందని వార్తలు వచ్చాయి. అయితే తానే నటిస్తున్నట్లు కంగనా చెప్పడంతో సందేహాలు తొలగిపోయాయి. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో కంగనా పోస్టు చేశారు. ‘అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టుల బృందంతో కలిసి పనిచేయబోతున్నారు. సీతారాముల ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నా’ అంటూ కంగనా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్‌లో సెట్లోకి
గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్‌లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు