Kangana: ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడిని మెచ్చుకున్న వారందర్నీ జైల్లో పెట్టాలి
భారీ బడ్జెట్‌తో బాలీవుడ్లో రూపుదిద్దుకున్న ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) టీమ్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) వ్యంగ్యాస్త్రాలు విసిరారు.....
చిత్రబృందంపై కంగన కామెంట్స్
ముంబయి: భారీ బడ్జెట్‌తో బాలీవుడ్లో రూపుదిద్దుకున్న ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) టీమ్‌పై నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ చిత్రదర్శకుడు అయాన్ ముఖర్జీని (Ayan Mukerji) మేధావి అంటూ మెచ్చుకున్న వారందర్నీ జైల్లో పెట్టాలని అన్నారు. ‘బ్రహ్మాస్త్ర’ తెరకెక్కించడంలో ఆయన విఫలమయ్యాడని.. సినిమా అసలేం బాలేదని పేర్కొంటూ ఈ చిత్రానికి పలు మీడియా సంస్థలు ఇచ్చిన రేటింగ్స్‌ని ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు.
‘‘అయాన్ ముఖర్జీని జీనియస్ అంటూ మెచ్చుకున్న వారందర్నీ జైలులో పెట్టాలి. ‘బ్రహ్మాస్త్ర’ తెరకెక్కించడానికి అతడికి 12 ఏళ్లు పట్టింది. 12 మంది సినిమాటోగ్రాఫర్లను, 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్‌ని మార్చాడు. ప్రొడక్షన్ ఖర్చుల రూపంలో రూ.600 కోట్లను కాల్చి బూడిద చేశాడు. ఇలాంటి వ్యక్తిని మేధావి అని పిలవడం హాస్యాస్పదంగా ఉంది. ఇక, కరణ్ జోహార్ తన సినిమా స్క్రిప్ట్‌లపై కంటే ఇతరుల శృంగార జీవితాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటాడు. రివ్యూలు, రేటింగ్స్, కలెక్షన్స్ వివరాలు.. ఇలా ప్రతిదాన్నీ డబ్బుతో కొనుగోలు చేసి తన సినిమాలకు ఇప్పించుకుంటాడు. ఈసారి అయితే దక్షిణాది వారి దృష్టి సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాడు. తాను తెరకెక్కించే సినిమాలో మంచి కథ, కథనం, టాలెంట్ ఉన్న నటీనటులను పెట్టుకోవడం మానేసి తమ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని దక్షిణాది నటీనటులు, దర్శకులు, రచయితల్ని కోరుకున్నాడు. ఇలా అక్కడి వారిని కోరుకునే బదులు మంచి టాలెంట్‌తో సినిమాలు చేస్తే సరిపోతుంది కదా’’ అని కంగన రాసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
జులై నుంచి ప్రేమలో..
ప్రభాస్ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో... అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. -
సంయుక్త.. ఊ కొట్టేనా?
తెలుగు చిత్రసీమలోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలందుకుంటూ స్టార్ నాయిక స్థాయికి చేరుకుంది సంయుక్తా మేనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘స్వయంభూ’తో పాటు శర్వానంద్‌తోనూ ఓ చిత్రం చేస్తోంది. -
ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది
‘నేను మొదటగా సంతోషపడేది నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడే’ అని అంటోంది బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్. ‘ఆర్టికల్ 370’తో భారీ విజయాన్ని అందుకుందీమె. హిందీలోనే కాదు తెలుగు చిత్రాల్లోనూ నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. -
వాణీ కోసమే ఈ పాత్ర!
నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది బాలీవుడ్ నాయిక వాణీ కపూర్. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఆమె ప్రధాన పాత్రలో ‘బడ్తమీజ్ గిల్’ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
‘కన్నప్ప’లో అక్షయ్ పని పూర్తి
‘కన్నప్ప’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. -
సమ్మోహనం.. ఈ కలయిక
అపూర్వమైన కలయికలు కొన్ని ఉంటాయి. వాళ్లు కలిశారంటే చాలు... సినిమాకి క్లాప్ కొట్టిన రోజే బ్లాక్‌బస్టర్ బొమ్మని తెరపై చూసేసినంత సంబరం. రజనీకాంత్ - అమితాబ్ బచ్చన్ కలయిక అచ్చం అలాంటిదే. భారతదేశం గర్వించదగ్గ తారలు ఈ ఇద్దరూ. -
త్వరలో కుందాపురానికి ‘కాంతార 1’
‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు రిషబ్ శెట్టి. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. -
ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు
అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే?
తాజా వార్తలు (Latest News)
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్‌భూషణ్ హడావుడి
-
రోహిత్‌కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?