kannappa: ‘కన్నప్ప’ తొలి బాణం

తన నేత్రాల్ని ఈశ్వరుడికి అర్పించిన పరమభక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు ప్రధాన పాత్రని పోషిస్తున్నారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 09 Mar 2024 10:30 IST

తన నేత్రాల్ని ఈశ్వరుడికి అర్పించిన పరమభక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు ప్రధాన పాత్రని పోషిస్తున్నారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మాత. ఆయనతోపాటు మోహన్‌లాల్‌, ప్రభాస్‌, శరత్‌కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. విల్లు ఎక్కుపెట్టిన కన్నప్పగా మంచు విష్ణు ఆ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘‘ధైర్యవంతుడైన యోధుడిగా... శివ భక్తుడిగా మంచు విష్ణు నటన ఆకట్టుకుంటుంది. పాత్రలోని గాఢతని చాటే లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. పలు భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని