Janhvi kapoor: సన్నీ.. తులసీల ప్రేమ కథ

‘బవాల్‌’ తర్వాత వరుణ్‌ ధావన్‌- జాన్వీ కపూర్‌ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్‌ లవ్‌స్టోరీని శశాంక్‌ ఖైతాన్‌ తెరకెక్కిస్తున్నారు.

Updated : 06 May 2024 09:49 IST

వాల్‌’ తర్వాత వరుణ్‌ ధావన్‌- జాన్వీ కపూర్‌ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్‌ లవ్‌స్టోరీని శశాంక్‌ ఖైతాన్‌ తెరకెక్కిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మాత. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్టు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఫొటోని పంచుకుంది జాన్వీ. ‘సరికొత్త ప్రేమకథతో అభిమానుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఎన్నో మలుపులతో ఆసక్తి పంచేందుకు సిద్ధంగా ఉంది. సన్నీ.. తన ప్రియురాలు తులసీ కుమారి కోసం ఎలాంటి సాహసాలు చేస్తాడో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే’ అని సన్నిహితవర్గాలు తెలిపాయి. ఇందులో అక్షయ్‌ ఒబేరాయ్‌, సన్యా మల్హోత్రా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్‌ ‘దేవర’, రామ్‌చరణ్‌ ‘ఆర్‌సీ16’ చిత్రాలతో బిజీగా ఉంది జాన్వీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని