Yash: కరీనా స్థానంలో నయన్‌?

‘కేజీఎఫ్‌’ విజయాల తర్వాత యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్‌’. గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Updated : 06 May 2024 09:36 IST

కేజీఎఫ్‌’ విజయాల తర్వాత యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్‌’. గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ఓ ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ పేరు పరిశీలనలో ఉన్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ, ఇప్పుడా పాత్రను నయనతార దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర బృందం ఆమెతో సంప్రదింపులు పూర్తి చేసిందనీ.. కథ నచ్చడంతో సినిమా చేసేందుకు నయన్‌ అంగీకారం తెలిపిందని తెలిసింది. అయితే ఇందులో ఆమె యశ్‌కు జోడీగా కనిపిస్తుందా? లేక సోదరిగా నటిస్తుందా? అన్నది స్పష్టత లేదు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని