KGF 2: కేజీయఫ్‌-2 ‘మెహబూబా’ ఫుల్‌ వీడియో సాంగ్‌ చూశారా..

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ నటించిన సినిమా కేజీయఫ్‌-2. ఈ చిత్రంలో యశ్‌కు జోడిగా  శ్రీనిధి శెట్టి నటించింది. ఈ సినిమాలోని మెహబూబా అంటూ సాగే లవ్‌ వీడియో సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది.

Updated : 11 May 2022 14:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ నటించిన సినిమా కేజీయఫ్‌-2. యశ్‌కు జోడిగా  శ్రీనిధి శెట్టి నటించింది. ఈ సినిమాలోని మెహబూబా అంటూ సాగే లవ్‌ వీడియో సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ఈ వీడియో సాంగ్‌ లింక్‌ను షేర్‌ చేసింది. ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని తల్లి సెంటిమెంట్‌ సాంగ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్‌ ఆఫీసుల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ స్థాయిలో వసూళ్లను సాధిస్తూ ఇప్పటికే రూ.1000కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని