విజయ్ దేవరకొండతో కృతి సనన్?
విజయ్ దేవరకొండ సరసన కృతి సనన్ నటించనుందా? అవుననే వినిపిస్తోంది సినీ వర్గాల్లో. విజయ్ హీరోగా దర్శకుడు సుకుమార్ ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే నాయికగా కృతిని ఎంపిక చేసే ఆలోచనలో ఉందట చిత్ర బృందం. విజయ్ కి జోడీగా ఇప్పటి వరకు నటించని భామ అయితేనే సినిమాకి కొత్తదనం వస్తుందని భావించి ఆమెతో చర్చలు జరిపారట దర్శకనిర్మాతలు.
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ దేవరకొండ సరసన కృతి సనన్ నటించనుందా? అవుననే వినిపిస్తోంది సినీ వర్గాల్లో. విజయ్ హీరోగా దర్శకుడు సుకుమార్ ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే నాయికగా కృతిని ఎంపిక చేసే ఆలోచనలో ఉందట చిత్ర బృందం. విజయ్‌కి జోడీగా ఇప్పటి వరకు నటించని భామ అయితేనే సినిమాకి కొత్తదనం వస్తుందని భావించి ఆమెతో చర్చలు జరిపారట దర్శక-నిర్మాతలు. మరోవైపు.. గతంలో సుకుమార్ దర్శకత్వంలో ‘1 నేనొక్కడినే’ చిత్రంలో నటించింది కృతి. ఆమె నటనకి ఫిదా అయిన సుకుమార్ ఈ ప్రాజెక్టుతో మరో అవకాశం ఇవ్వబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ఆది పురుష్’ చిత్రంలో నటిస్తోంది కృతి. ఇందులో సీత పాత్ర పోషిస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్.. ఈ చిత్రం పూర్తయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుగు దర్శకుల.. బాలీవుడ్ దండయాత్ర
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. -
సలార్ 2 ఈ నెలాఖరు నుంచే
ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. -
కరీనా స్థానంలో నయన్?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సన్నీ.. తులసీల ప్రేమ కథ
‘బవాల్’ తర్వాత వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీని శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. -
కోల్పోయిన అవకాశం తిరిగొచ్చింది
‘ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్. -
మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. -
ధ్రువ్ విక్రమ్.. కబడ్డీ ఆటగాడిగా
విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్ విక్రమ్ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!