Updated : 27 Jun 2022 06:45 IST

Tollywood: మా ప్రయత్నం విజయవంతం

మాస్‌ కథానాయకుడిగా మెప్పించాననే ప్రశంసలు ఈ సినిమాతో నాకు దక్కడం ఎంతో తృప్తినిచ్చిందన్నారు ఆకాష్‌ పూరి(Akash Puri). ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘చోర్‌ బజార్‌’(Chor Bazaar). జీవన్‌రెడ్డి దర్శకత్వం వహించారు. వీఎస్‌ రాజు నిర్మాత. యు.వి.క్రియేషన్స్‌ ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమాకి లభిస్తున్న స్పందనపై సంతృప్తిని వ్యక్తం చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒక పూర్తిస్థాయి వాణిజ్య సినిమా చేయాలన్న మా ప్రయత్నం విజయవంతమైంది. అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన  లభిస్తోంది’’ అన్నారు. ఆకాష్‌ పూరి మాట్లాడుతూ ‘‘గతంలో నేను చేసిన రెండు సినిమాలకంటే ‘చోర్‌ బజార్‌’ ఘనంగా ఉందని చెబుతున్నారు. నాకు అందమైన జ్ఞాపకాల్నిచ్చిందీ చిత్రం’’ అన్నారు. మేం పడిన శ్రమకి ఫలితం లభించిందన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో గీత రచయిత మిట్టపల్లి సురేందర్‌, సహ   నిర్మాత సురేష్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.


నవ్వుల ‘షికారు’

సాయిధన్సిక(Sai Dhanshika), తేజ్‌ కూరపాటి(Tej Kurapati), అభినవ్‌ మేడిశెట్టి, కె.వి.ధీరజ్‌, నవకాంత్‌, చమ్మక్‌చంద్ర ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘షికారు’(Shikaaru). హరి కొలగాని దర్శకత్వం వహించారు. పి.ఎస్‌.ఆర్‌.కుమార్‌ నిర్మాత. జులై 1న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. కొల్లి రామకృష్ణ, జి.నాగేశ్వర్‌రెడ్డి, టి.ప్రసన్నకుమార్‌, డి.ఎస్‌.రావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, బెక్కెం వేణుగోపాల్‌ తదితర సినీ ప్రముఖులు  హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘మాస్‌ని అలరించే వినోదంతో సినిమాని తీశాం. అందరినీ నవ్విస్తుంది’’ అన్నారు. సాయిధన్సిక మాట్లాడుతూ ‘‘మంచి కథతో రూపొందిన ఓ మంచి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నా. దర్శకుడు అందమైన పాత్ర ఇచ్చారు. శేఖర్‌చంద్ర బాణీలు ప్రాచుర్యం పొందాయి. కరణ్‌ సంభాషణలు, శ్యామ్‌ ఫొటోగ్రపీ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయ’’న్నారు. ఈ కార్యక్రమంలో నటులు రచ్చరవి, నవకాంత్‌, ధీరజ్‌ ఆత్రేయ, సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర, కళా దర్శకులు షర్మిల తదితరులు పాల్గొన్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని