Updated : 15 Aug 2022 06:48 IST

Liger: ‘లైగర్‌’ హంగామా

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా నటించిన ‘లైగర్‌’ (Liger) ఫ్యాన్‌డమ్‌ టూర్‌ వేడుక ఆదివారం హన్మకొండలో జరిగింది. కథానాయిక అనన్యపాండే (Ananya Pandey) తెలుగులో మాట్లాడి అభిమానులను ఆకట్టుకున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) మాట్లాడుతూ ‘విజయ్‌ సినిమాలోనే కాదు... నిజ జీవితంలోనూ హీరోనే’ అన్నారు. నిర్మాత చారి, నటుడు అలీ, విషు తదితరులు మాట్లాడారు. ఈ వేడుకకి తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, హన్మకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌ రిజ్వానా సుల్తానా పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts